ఇళ్ళులేనివారికి ఇళ్ళు, పట్టాలు, రిజిస్ట్రేషన్‌ సమస్యు పరిష్కరించాల‌ని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా ముఖ్యమంత్రికి పేద పట్ల చిత్తశుద్ది లేదని నేత విమర్శ

  ముఖ్యమంత్రి పేద పట్ల చిత్తశుద్దిలేదని, వుంటే  ఎన్నికల‌ వాగ్ధానం మేరకు పేదల‌కు ఇళ్ళు, పట్టాలు ఇవ్వాల‌ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు శ్రీ సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. పేదకు ఇళ్ళు, స్థలాలు, రిజిస్ట్రేషన్లు కోరుతూ సిపిఎం, సిపిఐ, వామపక్షా ల నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని తహశీల్థార్‌ కార్యాయం వద్ద ధర్నాలో ఆయన ప్రసంగించారు.  296 జీవో ప్రకారం కొండ, రెవిన్యూ స్థలాల్లో జీవిస్తున్న వారికి క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తామని, రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పినా  ఏదో ఒక కారణంతో పట్టాలు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని, జీవో ఎందుకు ప్రజకు ఉపయోగం లేదనందున అదులో మార్పు చేయాని కోరారు.   ఇళ్ళులేని పేదందరికీ ఇళ్ళు ఇస్తామని,పట్టాలు లేనివారికి క్రమబద్ధీకరించి పట్టాలిస్తామని తొగుదేశం పార్టీ ఎన్నికల ముందు  ప్రజకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.  తొగుదేశం పేదల ఓట్లతో గెలిచి తరువాత మాటమార్చిందన్నారు. సుమారు 2 సంవత్సరా ల పానలో హామీలు నెరవేర్చకుండా పెద్దల‌కు, సింగపూర్‌ కంపెనీకు మాత్రం వేల ఎకరాలు కట్టబెట్టడానికి ప్రభుత్వం పూనుకుంటుందన్నారు.  నగరంలో 1ల‌క్షా47వేల మంది ఇళ్ళులేని పేదల‌ను గుర్తించి 9 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు.  జక్కంపూడి, న్యూ రాజరాజేశ్వరిపేట, గంగిరెద్దు దిబ్బలో నిర్మాణమైన జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం.గృహాలు దాదాపు చాలా వరకు  ఖాళీగా వున్నాయి. సింగ్‌నగర్‌లో 3వే ఇళ్ళ నిర్మాణం సగంలోనే నిలిచిపోయినా అధికారులు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదు. కనదుర్గా ఫ్లైవోవర్‌ నిర్మాణం కొద్ది నెల్లోనే పూర్తి చేస్తున్న ప్రభుత్వం పేదల‌కు ఇళ్లు కట్టించడానికి వస్తున్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. స్థలాలు లేవనే సాకు చూపడం సరికాదన్నారు. ఉన్న స్థలాల్లోనే(ప్రభుత్వ స్థలాలు) పేదకు ఇళ్లు కట్టించి ఇస్తే సరిపోతుందని, ప్రభుత్వం ఇళుఇచ్చిన పేదల నుండి వాయిదా పద్దతిలో వసూలు చేసుకుంటే సరిపోతుందన్నారు. కృష్ణాకరకట్టపై పేదను తొగించి అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం మరోప్రక్క ముఖ్యమంత్రి నివాసం, అధికారపార్టీ నాయకులు కృష్ణానదిలో కట్టుకున్న భవనాల‌ను, స్థలాల‌కు చట్టబద్దం చేసే విధంగా వ్యవహరించడాన్ని విమర్శించారు. ధనవంతు ఇళ్లు కృష్టానదిలో కట్టుకున్నా సక్రమం, అదే పేదలు కట్టుకుంటే అక్రమమనే పద్దతి సరికాదన్నారు. పేద పట్ల ప్రభుత్వం ఈ విధమైన వైఖరి మార్చుకోవాని కోరే కమ్యూనిస్టుపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాని హితువు పలికారు. పేదు,అద్దెదాయి అనేక ఇబ్బందు పడుతున్న నేపథ్యంలో, అద్దొ భరించలేకపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే వారికి నీడ చూపాని కోరారు.  ఇళ్ళ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాని కోరారు. మార్చి 22వ తేదీన ఈ సమస్యల‌పై  జరిగే ఛలోవిజయవాడ కార్యక్రమంలో పాల్గొని  ప్రభుత్వంపై ఒత్తి తెచ్చేందుకు ప్రజలందరూ సహకరించాని కోరారు. ఈలోగా ప్రభుత్వం పేదకు ఇళ్ళు, స్థలాు, రిజిస్ట్రేషన్‌ విషయంపై స్పష్టమైన వైకరి ఇవ్వాని కోరారు.