
2016-17 సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉన్న సమయంలో తాను బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. తాము సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్నట్లు జైట్లీ తెలిపారు. ద్రవ్యోల్బణం 9శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిందన్నారు. భారత్ 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు వెల్లడించారు. లోక్ సభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సంబంధించి 19.78 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.