ఢిల్లీలో CPM శిక్షణా పాఠశాల..

ఢిల్లీలోని ఐటీఓ సమీపంలో గల రోజ్‌ఎవెన్యూలో హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ భవంతికి సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం శంకుస్థాపన చేశారు. ఐదంత స్థులతో నిర్మించనున్న ఈ భవంతిలో పార్టీ శిక్షణా పాఠశాలను నెలకొల్ప నున్నారు. కొల్‌కతా ప్లీనం నిర్ణయం మేరకు ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తు న్నారు. మార్చి మొదటి వారంలో నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టను న్నారు. ఈ భవంతిలో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశమందిరం, ఆడిటోరియం, విద్యార్థుల తరగతి గది, నివాస గదులు, వంటశాల నిర్మించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.