
జేఎన్ యూ నేత కన్హయ్య బెయిల్ ను తిరస్కరిస్తున్నట్లు తీర్పు చెప్పడంతో విద్యార్థులు..ఇతరులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. న్యాయస్థానాల ఎదుట దాడికి దిగిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మకు గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేశారని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కన్హయ్య అరెస్టుపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో వామపక్ష విద్యార్థి సంఘం నేతలు రైళ్లను ఆపివేసి తమ నిరసన తెలిపారు. మతతత్వవాదాన్నే కన్హయ్య వ్యతిరేకించారని తేలింది. దీంతో కన్హయను అక్రమంగా అరెస్టు చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి.