జగన్ కోర్టుకు హాజరవ్వాల్సిందే ..

ఆస్తుల కేసులో వైసీసీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 28న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్‌కు చెందిన సంస్థల్లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్ కంపెనీల పెట్టుబడులపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన న్యాయస్థానం జగన్‌ సహా 19 మందికి సమన్లు జారీ చేసింది.