February

అభివృద్ధి పనులపై అలసత్వమొద్దు

           ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చేపడుతున్న అభివృద్ధి పనులపై అలసత్వం వహించవద్దని కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. గురువారం టెక్క‌లి మండలంలోని శ్యామసుందరాపురంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న రోడ్లు, కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన మహిళ కలెక్టర్‌తో మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సక్రమంగా సరుకులు పంపిణీ కావడం లేదని ఫిర్యాదుచేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ జన్మభూమి కమిటీలకు అప్పగించామని, వారినే అడగాలని సమాధానమిచ్చారు.

విద్యాభివృద్ధికి ప్రోత్సాహం : మంత్రి

విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహిస్తోందని, వాటిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. గురువారం నిమ్మాడలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫార పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ చదువు కోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుందన్నారు. ఉపాధ్యాయులు భాధ్యతాయతంగా మెలిగి విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తర్ర రామకృష్ణ, ఎంఇఒ నక్క రామకృష్ణ పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వ విఫలం : వైసిపి

         ఎన్నికల హామీలను నెర వేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసిపి జిల్లా అధ్యక్షులు రెడ్డి శాంతి విమర్శించారు. గురువారం కంచిలి మండలంలోని గొల్లకంచిలిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 71 వేలు ఫిర్యాదులొస్తే 90 మాత్రమే పరిష్కరించారని దుయ్యబట్టారు. ఉద్యోగాలిప్పి స్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో వైసిపి ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, కృష్ణారావు, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

2013 చట్టం ప్రకారం పరిహారమివ్వాలి

వంశధార రిజర్వాయర్‌లో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం, ప్యాకేజీ అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారానికి 23వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి నిర్వాసితులు ఐక్యంగా పోరాడాలన్నారు. నిర్వాసిత గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతకు యూత్‌ ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేశారు.

నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే వారిపై దాడులు చేయటం హేయమైన చర్య - సిహెచ్‌ మణిలాల్‌

నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే సిపిఎం నాయకులపై దాడులు చేయటం హేయమైన చర్యని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ అన్నారు. మంగళవారం గుంటూరు సుందరయ్య కాలనీకి చెందిన రౌడీషీటర్లు, మాజీ నేరస్తులైన బాజీ, కోటేశ్వరరావులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బస్టాండ్‌ సెంటరులో రౌడీషీటర్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

సిపిఎం నాయకునిపై హత్యాయత్నానికి నిరసనగా మిన్నంటిన నిరసనలు

గుంటూరులో సిపిఎం నాయకులపై టిడిపి గూండాలు హత్యాయత్నాన్ని నిరసనగా మంగళగిరి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అంబేద్కర్‌ సెంటర్లో టిడిపి గూండా గడ్డిబొమ్మను దహనం చేశారు. తొలుత సిపిఎం కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. టిడిపి గూండా గడ్డిబొమ్మను దహనం చేస్తున్న సమయంలో పట్టణ ఎస్‌ఐ షేక్‌ జిలాని పోలీసులతో వచ్చి గడ్డిబొమ్మ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, సిపిఎం నాయకులకు వాగ్వివాదం జరిగింది. రౌడీషీట్‌ గడ్డిబొమ్మను దహనం చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడానికి సిపిఎం నాయకులు విమర్శించారు. రౌడీషీటర్లకు పోలీసులు అండగా ఉంటారా అని ప్రశ్నించారు.

హస్పిటల్ లో చికిత్స పొదితున్న ఆంజినేయులను పరామర్సించిన :- పి.మధు

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులుని పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడిని కలుసుకుని ఆంజనేయులు ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆంజనేయులుకు మెరుగైన వైద్యం అందించడం కోసం వైద్యులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. దాడిలో గాయపడిన భవన నిర్మాణ కార్మికుడు సతీష్‌నూ పరామర్శించారు. ఆంజనేయులు భార్య మల్లేశ్వరితో మాట్లాడారు. పార్టీ అండగా నిలుస్తుందని, అధైర్య పడవద్దని చెప్పారు. ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ పేదల కాలనీలను దౌర్జన్యంగా తరిమేయాలని చూస్తే సహించేది లేదన్నారు. రౌడీషీటర్ల విషయంలో సరైన విధంగా స్పందించని తాలూకా సిఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇది ఇళ్ళు ఇచ్చే ప్రభుత్వమా? కూల్చే ప్రభుత్వమా?

విజయవాడలో  పైపుల్‌రోడ్డు ప్రాంతం నుండి సుందరయ్య వ‌ర‌కు వున్న (సుంద‌ర‌య్య నగర్‌) కట్ట మీద వున్న పేద ఇళ్లను తొగించడానికి ప్రభుత్వం హడావుడి చేస్తుందని, ఇళ్ళు ఎక్కడిస్తారో? ఎప్పుడిస్తారో? స్పష్టం చేయకుండా తొగించే ప్రయత్నాలు మానుకోవాని  బాబూరావు కోరారు.  తొల‌గింపు విషయంలో ప్రజల్లో వున్న అనుమానాను ప్రభుత్వమే నివృత్తి చేయాల‌ని  డిమాండ్ చేశారు. ఎన్నికల‌కు ముందు మేము అదికారంలోకి  వస్తే ఇళ్ళుతొగించమని, పట్టాలు ఇస్తామని చెప్పిన టి.డి.పి అధికారంలోకి రాగానే ఇళ్లను తొగించే ప్రయత్నాలు ముమ్మరం చేయడం దారుణమన్నారు.

పాల‌కుల దాడిని తిప్పికొట్టగలిగేవి ప్రజాపోరాటాలే. సి.దివాకర్‌ వర్ధంతి సభలో సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు

తుమ్మపాల సుగర్‌ ఫాక్యరీ పోరాటానికి సిపియం పార్టీ సంపూర్ణ మద్ధతు.

అనకాపల్లి తుమ్మపాల కో-ఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటానికి సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణ మద్ధతు తెలియజేస్తుంది.

Pages

Subscribe to RSS - February