సింగ‌పూర్‌కు దాసోహం..

సింగ‌పూర్‌కు దాసోహమంటే స‌హించం.....వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌పై అవ‌గాహ‌న లేని మంత్రులు. 
మాస్ట‌ర్‌ప్లాన్‌లో స‌మూన మార్పులు చేయ‌క‌పోతే ఐక్య ఉద్య‌మాలు.
ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిని రాజ‌ధాని వ్య‌తిరేకులా చూడ‌టం  త‌గ‌దు.

    వ్యవసాయ పరిరక్షణ జోన్ అంశంపై మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు.  రైతుల‌, ప్రజా  ప్రయోజనాల‌ను రక్షించాల్సిన ప్ర‌భుత్వం అబ‌ద్దాలు చెబుతూ న‌య‌వంచ‌న చేస్తోంది.  అగ్రిజోన్‌కు, గ్రీన్‌బెట్లుకు సంబంధం లేదని మంత్రులు చేస్తున్న ప్రచారారం వాస్త‌వం కాదు.  గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న నిబంధనలే వ్యవసాయ పరిరక్షణ జోన్‌లో ఉన్నాయి. వాస్తవాల‌ను మరుగపర్చేందుకే మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సు జరకుండా ఇటువంటి ప్రకటనతో ప్రజల‌ను గందరగోళ‌ప‌ర్చ‌డం స‌మంజ‌స‌మా? అగ్రీజోన్‌లో రెసిడెన్షియల్‌, కమర్షియల్‌, ఇండస్ట్రీయల్‌, అన్నింటికి  అనుమతులు ఉంటాయని చెప్ప‌డం అబ‌ద్దం కాదా?  మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న అంశాల‌ను పూర్తి అవ‌గాహ‌న లేకుండా మంత్రులు మాట్లాడుతూ ప్రజకు వాస్తవాలు చెప్పకుండా ప్రక్కతోవ పట్టిస్తున్నారనేది  వాస్త‌వం.  మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు తెలిపిన వారిని రాజధాని వ్యతిరేకులుగా చిత్రీకరించడం సరైంది కాదు. అభ్యంతరాలు తెలిపే వారిలో ప్రతిపక్షాలే కాకుండా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి  నాయకు, రైతులు, కూడా వున్నారనేది వాస్త‌వం.  వీరందరినీ రాజధాని వ్యతిరేకులుగా పరిగణిస్తే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి వుండ‌దు.   ప్రతిపక్షాలు రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా కాదు. రాజ‌ధాని నిర్మాణ ముసుగులో జరుగుతున్న దోపిడీకీ వ్యతిరేకం. వ్యవసాయ పరిరక్షణ జోన్లతో సహా ఈ నె 25లోపు మాస్టర్‌ప్లాన్‌ మార్చాని. లేని పక్షంలో రైతాంగంతో పాటు, అన్ని సంఘాలు ప్రత్యేక్ష కార్యాచరణలోకి దిగుతాయి.  ఇందుకు సి.పి.ఎం. పార్టీగా పూర్తి  మద్దతు ఉంటుంది.  వ్యవసాయ పరిరక్షణ జోన్ల అంశంపై బహిరంగ చర్చకు మంత్రులు రావాలి. ప్ర‌భుత్వం  అఖిపక్ష సమావేశం  ఏర్పాటు చేసి దీనిపై వివరణ ఇవ్వాలి. వ్యవసాయ పరిరక్షణ జోన్లపై స్థానిక సంస్థల్లో కూడా  చ‌ర్చపెట్టాలి.  అసెంబ్లీ సమావేశాల్లో మాస్టర్‌ప్లాన్‌పై చర్చ నిర్వహించాలి.