
దేశంలో మొండిబకాయిలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు, ఆర్ధిక సంస్థలకు 500 కోట్లకు పైగా బాకీ పడ్డవారి జాబితాను తమకు పంపించాలని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కోరింది. 6 వారాల గడువు విధించింది. వివరాలతో పాటు అఫిడవిట్‌ను కూడా పంపించాలని సూచించింది. అదే విధంగా గత ఐదేళ్లలో మాఫీ చేయబడిన భారీ మొత్తాలకు సంబంధించిన వివరాలను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఈ వివరాలను సీల్డ్ కవర్‌లో తమకు అందించాలని సుప్రీం ఆర్‌బీఐని కోరింది.