పెద్ద‌ల‌కు దోచిపెడుతున్న ప్రభుత్వం: బాబూరావు

రాజధానిలో భూ కుంభకోణాను ప్రభుత్వం చట్టబద్ధం చేస్తోంది.  పేద‌ల‌ను న‌ట్టేట ముంచి పెద్ద‌ల‌కు దోచిపెట్టేందుకు ప్ర‌భుత్వం పూనుకుంది. లంక‌భూముల వ్య‌వ‌హారంలో బ‌హిర్గ‌త‌మయింది.  అసైన్డ్‌, లంక, ఫారెస్ట్‌ భూములు అమ్మడానికి వీల్లేదని చెప్పి దళితులు, పేదల‌ను భయపెట్టి పెద్దలు భూము కొనుగోలు చేశారు.  న‌ష్ట‌పరిహారం కూడా ఇవ్వబోమని చెప్పడంతో పేదలు భయపడి భూముల‌ను తక్కువ ధరకు అమ్ముకున్నారు.  కొనుగోళ్లు పూర్త‌యిన త‌రువాత  జిఓ నెంబరు 41 విడుదల చేసి వాటిని చట్టబద్ధం చేసి పెద్ద‌ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్య‌క్షంగా తోడ్ప‌డింది. ద‌ళితుకు న్యాయం చేయానే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఈ జీవో గత ఏడాది ఏప్రిల్‌, మార్చిలోనే  ఇవ్వాలి. కాని  ప్ర‌భుత్వం ఆ విధంగా చేయ‌లేదు. పేద‌ల వ‌ద్ద భూములును లాక్కొనేందుకు కుట్ర‌ప‌న్నింది. పెద్ద‌ల‌కు భూముల‌ను క‌ట్ట‌బెట్టింది.  ఈ జీవో. ముందుగానే ఇచ్చి వుంటే ద‌ళితుల‌కు న్యాయం జరిగేది.  ఒకపక్క రాజధాని పేరుతో ఆ గ్రామాల్లో ఉన్న పేదను బతకలేని పరిస్థితుల్లోకి నెడుతూ మరోవైపు ఇష్టారాజ్యంగా భూములు కొన్న వారిని కోటీశ్వరును చేస్తున్నారు.   ఇప్పటి వరకూ సుమారు రూ.10 వే కోట్ల రూపాయ కుంభకోణం రాజధాని ప్రాంతంలో జరిగింది. దీనిపై ఫ్రభుత్వం స్పందించి అసలు రాజధానిలో ఎన్ని ఎకరాల భూముల‌మ్మారు. ఎవరి భూములు కొనుగోలు చేశారు. ఎంతకు కొనుగోలు చేశారు. కొన్నవారెవరూ అనే విషయాపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుద చేయాలి. అలాగే దళితుల‌ భూములు దళితులే కొనుగోలు చేస్తే వారికి పూర్తి పరిహారం ఇవ్వాలి. రాజధాని ప్రాంతంలో ఎవరికీ చెందని భూములు 500 ఎకరాలుంటే వాటికి పట్టాలచ్చాయని, అలా ఎందుకొచ్చాయో విచారణ జరపాల‌ని డిమాండు చేశారు. అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్లల‌ను రద్దు చేయాలి.  లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యాన పెద్దఎత్తున పోరాడుతాము.   
-  సుంద‌ర‌య్య భ‌వ‌న్‌లో జ‌రిగిన ప్ర‌తికావిలేర్ల స‌మావేశం రాజ‌ధానిప్రాంత స‌మ‌న్వ‌య క‌మిటీ క‌న్వీన‌ర్ సిహెచ్‌.బాబూరావు.