సీమ హామీలపై స్పష్టత ఏది? : కృష్ణయ్య

రాయలసీమ ప్రాజెక్టుల గురించి స్పష్టంగా చెప్పకపోవడాన్ని వామపక్షాల నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.మదనపల్లి బస్టాండులో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చువుతుందని ముఖ్యమంత్రి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారని, అయితే గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో స్పష్టం చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టుల మొదటి దశ, రెండో దశ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేస్తామంటూ డొంక తిరుగుడుగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.అభివృద్ధి ముసుగులో ముఖ్యమంత్రి.. అమరావతి అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తూ, వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ, వాటి మధ్య అసమానతలు పెంచి పోషిస్తున్నారని వివరించారు.