ఆక్వాఫుడ్‌ పార్కు నిర్మాణం ఆపాలి

 ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒక్క ఇటుకను పేర్చినా ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో బహిరంగ సభ నిర్వహించారు.ఇంట్లో పెట్టుకునే ఎసికి వినియోగించే అమ్మోనియం వాయువు కంటే లక్షల రెట్లు అధికంగా ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీల్లో ఐస్‌ తయారు కావడానికి వినియోగిస్తారని, ఆ సమయంలో గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందితే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో జన్మించి పరిసర ప్రాంతాల్లో ప్రజలు బతికే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వట్టి మాటలు కట్టిపెట్టి ఫ్యాక్టరీలకు ఇచ్చిన లైసెన్సులను రద్దు చేస్తూ జిఒలు జారీ చేసే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.