ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది..... నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది.....
నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .
                                                                      - సిహెచ్‌.బాబూరావు డిమాండ్ 
   సి.ఆర్‌.డి.ఏ మాస్ట‌ర్‌ప్లాన్‌పై ప్ర‌జాప్ర‌తినిధులతో అధికారులు జ‌రిగిన  స‌మావేశంలో తెలుగుదేశం పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు కూడా మాస్ట‌ర్‌ప్లాన్‌పై అభ్యంత‌రాలు చెప్పారు. మార్పులు చేయాల్సిన అవ‌సరం వుంద‌ని  స‌మావేవంలో అధికారుల‌కు తెలప‌డం జ‌రిగింది. ప‌ది నెల‌ల త‌రువాత అధికా పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులకు జ్ఞానోద‌యం అయినందుకు సంతోషం. ఇప్ప‌టి వ‌ర‌కు సి.ఆర్‌.డి.ఏ. ప్లాన్‌లో మార్పులు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని మంత్రులు దేవినేని ఉమా, నారాయ‌ణ ప‌నిక‌ట్టుకుని ప్ర‌చారం చేశారు. కానీ వారి పార్టీ ఎం.ఎల్‌.ఏలే మార్పు అవ‌స‌రం అని అంటున్నారు. దీని బ‌ట్టి ఎవ‌రివి అబ‌ద్దాలో అర్ధ‌మ‌యిపోయింది.  గ‌డ‌చిన 10 నెల‌ల కాలంలో అనేక సంద‌ర్భాల్లో సిపిఎం పార్టీగా ప‌లు స‌మ‌స్య‌ల‌ను అదికారుల దృష్టికి తీసుకెళ్ళాము. వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌లో మార్పులు చేయాల‌ని కోరాము. అవే ఇప్పుడు అదికాపార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు కోరుతున్నారు. నిజంగా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు ప్ర‌జ‌ల ప‌ట్ల చిత్త శుద్ధి వుంటే  నేరుగా ముఖ్యమంత్రి గారికే నేరుగా ఈ విష‌యం చెప్పాలి.  ఇప్ప‌టికే  ప్ర‌జ‌లు అనేక ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతున్నారు. వ్య‌వసాయానికి ప‌నికి వ‌చ్చే భూములు రాజ‌ధాని నిర్మాణానికి తీసుకుని, క‌రువు మండ‌లాను వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌లో వుంచారు. దీనితో కూలీలకు, రైతుల‌కు, వ్య‌వ‌సాయ కార్మికుల‌కు ప‌ని లేకుండా పోయింది. మ‌రో ప్ర‌క్క లేఅవుట్‌లు నిలిపివేయ‌డంతో భ‌వ‌నిర్మాణ రంగం కుదేల‌యింది. కొన్ని మండ‌లాలలో లేఅవుట్‌ల కోసం 2014లో పెట్టిన ద‌ర‌ఖాస్తులు నిలిపివేశారు. కృష్ణా,గుంటూరు జిల్లాలో 150 లేఅవుట్ల‌ను అధికారులు తిర‌స్క‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 5వేల ఎక‌రాల భూముల లావాదేవీలు నిలిచిపోయాయి.  ద‌ర‌ఖాస్తుల‌న్నింటిని ప్ర‌భుత్వం అనుమ‌తించి వుంటే సుమారు 1000 కోట్లు ఆదాయం వ‌చ్చేది. ప్ర‌భుత్వం ఈ విధంగా చ‌ర్య‌లు తీసుకోకుండా సింగ‌పూర్ కంపెనీల‌కు లాభం చేకూర్చే ప‌నిలో వుంది. నాలాప‌న్ను పేరుతో 200 కోట్లు ప్ర‌భుత్వం వ‌సూలు చేసింది.  మ‌రోప్ర‌క్క ప‌ట్ట‌ణ ప్రాంతాలలో ఇంటి అద్దెలు పెరుగుతూనే వున్నాయి.  ఈ చ‌ర్య‌ల‌పై ప్ర‌జ‌లలో అసంతృప్తి పెరుగుతోంది. ప్రభుత్వం స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పూనుకోక‌పోతే రాబోయే రోజుల్లో అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోరాటం చేస్తాం.