
స్మృతిఇరానీ అంశంతోపాటు, కేంద్ర సహాయ మంత్రి రామ్‌శంకర్ కటారియా 'విద్వేష' ప్రసంగం, ఎయిర్‌సెల్- మ్యాక్సెస్ వ్యవహారం ఉభయసభలను కుదిపేశాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు అన్నాడిఎంకె సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు అడుగుముందుకు పడకుండా బుధవారానికి వాయిదా పడ్డాయి. హెచ్‌సీయూ, జేఎన్‌యూ వ్యవహారంలో హెచ్‌ఆ ర్‌డి మంత్రి స్మృతిఇరానీపై 'తప్పుడు ఆధారాల అంశం'పై కాంగ్రెస్‌తో పాటు వామపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.