రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి

 రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. శుక్రవారం స్థానిక కళాజ్యోతి సర్కిల్‌ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జీపుజాత ధర్మవరం నుంచి గొల్లపల్లి, ఉప్పునేసినపల్లి, చిగిచెర్ల, ముష్టూరు, బత్తలపల్లి, తాడిమర్రి, రామాపురం మీదుగా ముదిగుబ్బకు చేరుకుని అక్కడినుంచి ధర్మవరానికి చేరుకుంటుందన్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమను పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టిడిపి రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా హంద్రీనీవాకు నిధులు కేటాయించి కాలువ పనులను త్వరగా పూర్తీ చేసి సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు పోలారామాంజినేయులు, ఎస్‌హెచ్‌.బాషా, జంగాలపల్లి పెద్దన్న, ఎల్‌.ఆదినారాయణ, జెవి.రమణ, పోలా లక్ష్మినారాయణ, సిపిఐ నాయకులు గుండాపురుషోత్తం, బైముతక రమణ, బాబాఫకృద్ధీన్‌, భాస్కర్‌