రాజ్యాంగ పరిరక్షణ కోసం వామపక్షాల ర్యాలీ

దేశంలో నెలకొన్న అసహనాన్ని నిరసిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు సాగిన ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఒ.నల్లప్ప, సిపిఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్లప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకురాలు లలితమ్మ, ఆర్‌ఎస్‌పి నాయకులు బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రాజకీయ స్వార్థం, అధికారం దాహం కోసం మతచిచ్చు, కుల చిచ్చు పెడుతున్నారని అన్నారు. ఉన్నత విశ్వవిద్యాలయాల్లో కూడా మతోన్మాదాన్ని సృష్టించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే కోవలో జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షులు కన్నయ్యపై దేశద్రోహం కేసు బనాయించి అన్యాయంగా జైలుపాలు చేశారని చెప్పారు. బిజెపి, దాని అనుంబంధ సంఘాలు మతోన్మాదమే హద్దుగా వ్యవహరిస్తున్నారని ఇది సమాజానికి మందికాదన్నారు. భావస్వేచ్చా ప్రకటన చేయడానికి వీలు లేకుండాపోయిందని ఆవేదన చెందారు. ప్రజాస్వామ్యాన్ని బిజెపి ప్రభుత్వం అభాసుపాలు చేసే రీతిలో అనుసరిస్తోందని, మతోన్మాదాన్ని ప్రేరేపిస్తోందన్నారు. స్వదేశీముసుగులో విదేశీ జపం చేస్తున్న బిజెపి జాతీయత గురించి మాట్లాడటం సిగ్గుగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని హితవుపలికారు. జెఎన్‌యులో విద్యార్థి సంఘం అధ్యక్షులు కన్హయ్యపై విధించిన దేశద్రోహం కేసును ఉపసంహరించి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ నాయకులు జాఫర్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.సావిత్రమ్మ, బిహెచ్‌ రాయుడు, సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు ఎస్‌.నాగేంద్రకుమార్‌, లింగమయ్య, సిపిఎం నగర నాయకులు నాగరాజు, గోపాల్‌, ముష్కిన్‌, ఎస్‌యుసిఐ రాఘవేంద్ర