2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7 నుంచి 7.5శాతంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభలో ఎకానమిక్ సర్వే రిపోర్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమర్పించారు. 2015-16లో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో లేనప్పటికి.. జీడీపీలో ద్రవ్యోలోటును 3.9శాతానికి తగ్గిస్తామని నివేదికలో పేర్కొంది.