December

భూములిచ్చిన రైతుల్లో అసహనం..

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో అసహనం పెరిగిపోతోంది. పూలింగులో ఉన్న శ్రద్ధ తమకు వాటా ఇచ్చే సమయంలో లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. జనచైతన్య యాత్రలనూ బహిష్కరిస్తున్నారు.రాజధాని ప్రకటించిన తొలిరోజే భూములిచ్చామని, ఇంతవరకు ప్లాట్లు ఎక్కడిస్తారో చెప్పడం లేదని టిడిపి నాయకులను ప్రశ్నిస్తున్నారు.

పాక్ వెళ్లనున్న భారత ప్రధాని..

భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే పాకిస్తాన్‌కు వెళ్లనున్నాడని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. హార్ట్ ఆఫ్‌ ఏషియా సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌కు వెళ్లిన ఆమె మీడియాతో ఈ విషయాన్ని తెలిపారు. 2016లో జరగబోయే సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీజనల్‌ కోపరేషన్‌ (సార్క్) సమ్మిట్‌లో భాగంగా మోడీ ఇక్కడి రానున్నట్లు పేర్కొన్నారు.

మద్యంపైజగన్ మాటలుహాస్యాస్పదం

 బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావును పక్కన పెట్టుకుని జగన్‌ మద్యపాన నిషేధంపై మాట్లాడటం హాస్యాస్పదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.  వైఎస్‌ హయాంలో మద్యం ఏరులై పారిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కల్తీ మద్యం వల్ల పదుల సంఖ్యలో జనం చనిపోయారని తెలిపారు. కల్తీ మద్యం కేసులు బొత్స కుటుంబంపై ఇంకా ఉన్నాయని సోమిరెడ్డి వెల్లడించారు. కల్తీ మద్యం ఘటనను ప్రభుత్వం సీరియస్ తీసుకుందన్నారు. అందుకు నిదర్శనంగా ప్రభుత్వ సిట్‌ను ఏర్పాటు చేసిందని చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు.

విజయవాడ కల్తీ మద్యం ఘటనపై నిరసన..

విజయవాడ కల్తీ మద్యం ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో జ్యూడిషియల్‌ విచారణ జరిపించాలని, ఘటనకు బాధ్యత వహించి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర తక్షణమే రాజీనామా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. కల్తీ మద్యం ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బందర్‌ రోడ్డులోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎక్సైజ్‌ మంత్రి రాజీనామా చేయాలని, ఎక్సైజ్‌ పాలసీని మార్చాలని, స్వర్ణా బార్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మహిళలు ముఖానికి నల్లగుడ్డలు కట్టుకుని ప్రభుత్వ మద్యం పాలసీపై నిరసన వ్యక్తం చేశారు.

ఖజానా నింపుకోడానికే ప్రభుత్వం:మధు

విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మృతి చెందటానికి ప్రభుత్వ మద్యం విధాన మే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఖజానా నింపుకో వటమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింద న్నారు. మృతుల కుటుం బాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరి హారం చెల్లించాలని ఆయన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బాధితు లకు ఉన్నత వైద్య సౌకర్యం అందించాలని కోరారు.

విశాఖలో లోకేష్ కు చేదుఅనుభవం

హుదూద్‌ పరిహారం ఇంతవరకూ అందలేదంటూ విశాఖ జిల్లా చీడికాడలోని ఎస్‌సి కాలనీ మహిళలు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను నిలదీశారు. మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలంలో సోమవారం జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ ఇబ్బదులను లోకేష్‌కు వివరించారు. ఎస్‌సి కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేయలేదని, గ్రామ సమీపంలో బంజరు భూముల పట్టాలను తమకు ఇవ్వలేదని, రేషన్‌కార్డులు, పింఛన్లు, మరుగుదొడ్లు వంటి సమస్యలపై పట్టించుకునే నాథుడే లేడని నిరసన వ్యక్తం చేశారు.

CPIబర్థన్‌కుబ్రెయిన్‌స్ట్రోక్‌..

సిపిఐ కురువృద్ధుడు ఎ.బి.బర్థన్‌ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్య నిపుణులు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున మెదడులో రక్తనాళాలు చిట్లి గడ్డకట్టుకు పోవడంతో ఇక్కడి జిబి పంత్‌ ఆసుపత్రికి వెంటనే తరలించారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. మరో 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌ మీద వుంచారు. మెదడు కుడివైపు భాగంలో సుమారు యాభై శాతం వరకు రక్తం గడ్డకట్టింది. ఎడమ వైపు శరీరం పూర్తిగా చచ్చుబడిపోయి పక్షవాతం వచ్చింది. ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడం ఇది మూడోసారి. 

మద్యం పాలసీని పున:సమీక్షించాలి..

 విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్‌లో కల్తీ మద్యం తాగి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు..కల్తీ మద్యం మృతులు, బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 40 మంది సిపిఎం నాయకులను పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించేందుకు సిఎం చంద్రబాబు వెళ్లినపుడు సిపిఎం రాజధాని ప్రాంత కమిటీ కార్యదర్శి సిహెచ్‌.బాబూరావు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రి వద్ద కూడా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు.

Pages

Subscribe to RSS - December