December

అప్రజాస్వామిక కమిటీలు..

 జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలన నిర్వహిస్తున్న తీరు అప్రజాస్వామికం, దుర్మార్గం. ఏ మాత్రం చట్టబద్ధత కానీ, రాజ్యాంగబద్ధత కానీ లేని ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో సర్వం తామే అయి వ్యవహరిస్తున్న విధానం విస్మయాన్ని కలిగిస్తోంది. రేషన్‌ కార్డులు, ఫించన్ల నుండి వరద సాయం వరకు క్షేత్రస్థాయిలో అన్ని అంశాల్లో జన్మభూమి కమిటీలదే పెత్తనం కావడంతో స్థానిక సంస్థలు నామమాత్రంగా మారుతున్నాయి.

కల్బుర్గి కేసులో సిఐడి విఫలం..

ప్రముఖ రచయిత, హేతువాది ఎంఎం కల్బుర్గిపై హత్య జరిగి వంద రోజులు గడుస్తున్న కర్నాటక సిఐడి నిందితులను గుర్తించడంలో విఫలమైంది. దీంతో కర్నాటక ప్రభుత్వం కేసును సిబిఐకు అప్పగించాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్రాన్ని కోరారు.

వచ్చే ఏడాది మోడీ పాక్ పర్యటన..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే ఏడాది పాక్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో తన పాక్ పర్యటనపై సుష్మా ప్రకటన చేశారు. 2016లో పాక్ లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మోడీ హజరౌతారని తెలిపారు.

సీమకు అన్యాయం జరగనివ్వం:మధు

రాయలసీమకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు.రాయలసీమ అభివృద్ధి సమితి అధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ అభివృద్ధిపై నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు..అలాంటి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూములను స్వాధీనం చేసుకొంటోందని, టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.

లోక్‌సభలో ఎగవేతదారుల వివరాలు

ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొత్తం ఎగవేతల విలువ రూ. 64,334 కోట్లని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. రుణగ్రహీతలతో బ్యాంకు అధికారులు కుమ్మక్కైన కేసులు 115 అని శుక్రవారం ప్రభుత్వం వెల్లడి చేసింది. నిరర్థక ఆస్తుల అంశం ఒక ముఖ్య సవాలుగా ఉందని అంటూ, దీని పరిష్కారం కోసం బహుళ స్థాయిల్లో వేగవంతమైన చర్యలు తీసుకుంటు న్నామని ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా అన్నారు. రూ. 25 లక్షలకు మించి రుణం తీసుకున్న ఉద్దేశపూరిత ఎగవేతదారులుగా 7,265 మందిని గుర్తించామని చెబుతూ, వారి వివరాలను సిన్హా సభలో వెల్లడి చేశారు. 

GSTపైఅఖిలపక్ష్యంవేయాలి:ఏచూరి

రాష్ట్రాల ఆర్థిక అధికారాలపై తీవ్ర ప్రభావం చూపనున్న జిఎస్‌టి బిల్లు విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు.  రాష్ట్రాల సేల్స్‌టాక్స్‌ను కేంద్రం తమ గుప్పెట్లోకి తీసుకునే జిఎస్‌టి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. దేశంలో 50 శాతం కంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. అందుకే ఆయా రాష్ట్రాలతోనూ, అన్ని పార్టీలతోనూ కేంద్రం మాట్లాడాలని తాము కోరుతున్నామన్నారు.

రాహుల్‌పై కేజ్రి ట్వీట్..

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు కురిపించారు. దిల్లీలో రైల్వే స్థలాల ఆక్రమణల తొలగింపుపై ఆప్‌ ఎందుకు పార్లమెంటు వద్ద గొడవ చేస్తోంది.. ఢిల్లీలో అధికారంలో ఉంది వారే కదా అని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ విమర్శించారు. 'రాహుల్‌ చిన్నపిల్లాడు.

బెజవాడలో TS సిఎం KCR

చంద్రబాబుతో కెసిఆర్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశం గంటన్నరపాటు కొనసాగింది. తిరిగి విజయవాడ నుండి కెసిఆర్‌ హైదరాబాద్ బయల్దేరారు. ఆయుత చండీ యాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కెసిఆర్‌ విజయవాడ చంద్రబాబు ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.

కాల్‌మనీపై బాబుకు జగన్‌ లేఖ..

కల్‌మనీ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు వైఎస్‌ఆర్పీ అధినేత జగన్‌ లేఖ రాశారు. కాల్‌మనీ దందా టిడిపి అండచూసుకునే కొనసాగుతుందని దీనికి చంద్రబాబు అండ చూసుకునే రాక్షసకాండ కొనసాగిస్తున్నరని తెలిపారు. వైఎస్‌ఆర్పీ, కాంగ్రెస్‌ వామపక్షాలకు కాల్‌మనీ బురద అంటగడుతున్నరని ప్రభుత్వమే మాఫియాగా మారడం ఇప్పుడే చూస్తున్నామని ఆయన తెలిపారు.

విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం..

రాజమండ్రిలో సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిధులుగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి. మధు హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు.పార్టీ పటిష్టత కోసం విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలు ఉధృతం చేయాల్సిన అవసరముందన్నారు. 

Pages

Subscribe to RSS - December