కాల్‌మనీపై విచారణచేయాలి:CPM

విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ ఘటనపై హైకోర్టు న్యాయ మూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు.చట్టవిరుద్ధంగా కాల్‌మనీ వ్యాపారం చేస్తూ మహిళలను వ్యభిచారకూపంలోకి దించిన వారి ఆస్తులను తక్షణమే జప్తుచేయాలని కోరారు. ఆయా ఆస్తులను బాధిత మహిళలకు తిరిగి ఇవ్వాలన్నారు. కాల్‌మనీ వ్యాపారమే కాకుండా దాని ద్వారా మహిళలను వేధించడం, లోబరచుకోవడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చట్టం చేసి దానిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.