ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతున్నా మనదేశంలో ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలకు ఆ ప్రయోజనాలు అందటంలేదని సిపిఎం విమర్శించింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు నానాటికీ తగ్గుతున్నాయని, ప్రస్తుత గతంలో కంటె మూడు రెట్లు ధరలు పడిపోయాయని చెప్పారు. అయితే నరేంద్రమోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను తొమ్మిదిసార్లు పెంచివేసిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిమితి దాటిన ఉత్పత్తి, అమెరికన్ డాలర్ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు పడిపోతున్నాయని ఆయన గుర్తుచేశారు.