కాల్‌మనీపై అసెంబ్లీలో రగడ..

శీతాకాల సమావేశాల శుక్రవారం రెండోరోజున కూడా కాల్‌మనీ వ్యవహారంపై అధికారప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ నడిచింది.మధ్యాహ్నం సభలో సిఎం కాల్‌ మనీపై ప్రకటన చేశారు. సిఎం ప్రకటన చేస్తుండగా ప్రతిపక్షసభ్యులు ఆయన స్థానం వద్దకు వెళ్ళి అడ్డు తగలడంతో సభలో గందరగోళం చెలరేగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ మార్మోగింది. వైఎస్‌ ఆర్‌ సి పి సభ్యురాలు రోజా సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సభనుంచి ఆమెను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె సభనుంచి నిష్క్రమిస్తే తప్ప ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వనని స్పీకర్‌ ప్రకటించారు.