December

CPM ప్లీనంకు 10లక్షల మంది..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ (ఎం)జరుప తలపెట్టిన ప్లీనం ఏర్పాట్లు విస్తృతంగా జరుగు తున్నాయి. ప్లీనం ఏర్పాట్లతో కోల్‌కత్తా నగరం ఎర్రబారింది. 37ఏళ్ల తర్వాత జరుగుతున్న సీపీఐ(ఎం) ప్లీనంలో 456 మంది ప్రతినిధులు హాజరవుతారని రబీన్‌ దేవ్‌ తెలిపారు. డిసెంబర్‌ 20న పీడీజీ భవన్‌లో ప్లీనం ప్రారంభమవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 77, 247 బూత్‌లలో ఉన్న ప్రజలందరినీ కదిలించే విధంగా కోల్‌కత్తా నగరం ఐదు వైపుల నుంచి ఐదు ర్యాలీలుగా దాదాపు పది లక్షల మంది ప్రజలు రానున్నారని ఆయన తెలిపారు. 

కాల్‌మనీ కీచకులను శిక్షించాలి..

 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి కాల్‌ మనీ కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమో క్రసీ, లిబ రేషన్‌, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా, బహు జన సమాజ్‌ పార్టీల ఆధ్వర్యంలో బుధ వారం వంద లాది మంది భారీ ప్రదర్శన నిర్వహిం చారు. అనంతరం సిపి గౌతమ్‌ సవాంగ్‌ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. బాబూరావు మాట్లా డుతూ, కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ ఘటనపై ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా స్పందించా లన్నారు.

VRAల నిరాహారదీక్షకు మద్దతు..

గత 45రోజులుగా రిలే నిరహారదీక్షలు చేస్తున్న విఆర్ఎలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలిపారు. 45రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, తక్షణం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న వాళ్లనందరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు తాను అధికారంలోనికి వస్తే అందరిని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారని కాని ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. వి ఆర్ ఎ లు చేసే న్యాయమైన పోరాటానికి సిపిఎం మద్దతు ఎప్పుడూ ఉంటుందని మధు తెలిపారు.. 

కాల్‌మనీపై విచారణచేయాలి:CPM

విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ ఘటనపై హైకోర్టు న్యాయ మూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు.చట్టవిరుద్ధంగా కాల్‌మనీ వ్యాపారం చేస్తూ మహిళలను వ్యభిచారకూపంలోకి దించిన వారి ఆస్తులను తక్షణమే జప్తుచేయాలని కోరారు. ఆయా ఆస్తులను బాధిత మహిళలకు తిరిగి ఇవ్వాలన్నారు. కాల్‌మనీ వ్యాపారమే కాకుండా దాని ద్వారా మహిళలను వేధించడం, లోబరచుకోవడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చట్టం చేసి దానిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

రాజధాని ప్రాంతంలో పర్యటన..

రాజధాని ప్రాంతంలో అభద్రతా భావం పెరుగుతోందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, గుంటూరు కార్యదర్శివర్గ సభ్యులు జొన్న శివశంకరరావు, రాధాకృష్ణ, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవితో కలిసి శ్రీనివాసరావు సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు.సింగపూర్‌ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. తప్పులకు అధికారులను బలిపశువులు చేస్తూ మంచిని మాత్రం మంత్రులు తమకు ఆపాదించుకుంటున్నారని తెలిపారు. సమీకరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు.

బాక్సైట్ పోరు ఉధృతం:రఘువీరా

 ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా చేపట్టిన బాక్సైట్ తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 28, 29 తేదీల్లో విశాఖ మన్యంలో కాంగ్రెస్ నాయకులు, గిరిజన ఎంపీల బృందం పర్యటించాలని నిర్ణయించినట్లు రఘవీరా తెలిపారు.

కాల్ మనీపై గవర్నర్కు ఫిర్యాదు

విజయవాడ రాష్ట్రంలో బయటపడిన కాల్ మనీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డబ్బు ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన డబ్బే కాకుండా ఆ పార్టీకి చెందిన మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్సీల డబ్బు కూడా ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్..గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు.

సింగపూర్‌ చంద్రబంధంలో అమరావతి

 ఆలూలేదు, చూలూ లేదు అమరావతి అంతర్జాతీయ నగరం అని ఆర్భాటం చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం-ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కల్పించిన భ్రమలూ, చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 'సింగపూర్‌ కంపెనీల గొంతెమ్మ కోర్కెలు' శీర్షికతో ఈనాడు పత్రిక డిసె ంబర్‌ 11న ఇచ్చిన వార్త దీనికొనసాగింపే. ఆ వెంటనే సదరు వార్తను సమతుల్యం చేసేందుకన్నట్టు ఆంధ్రజ్యోతి మరో వార్తా కథనం ప్రచురించింది.

Pages

Subscribe to RSS - December