December

అంగన్‌వాడీలకు వెన్నుపోటు..

అంగన్‌వాడీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమానవీయంగా ప్రవర్తిస్తూ వారి ఉసురు పోసుకుంటున్నాయి. మాతా శిశు సంక్షేమంలో, శిశు, బాలింత మరణాల నివారణలో ప్రపంచంలోనే అథమస్థాయిలో ఉండి కూడా వారికి కాస్తంత ఊరట కల్పిస్తున్న ఐసిడిఎస్‌ నిర్వీర్యానికి కేంద్రంలో బిజెపి సర్కారు కుయుక్తులు పన్నుతుండగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం అదే బాటలో నడుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణే కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను ఒంటి చేత్తో ఈదుతున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు జీతాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం హామీ ఇచ్చి తప్పించుకు తిరుగుతోంది.

హైదరాబాద్ కు రాష్ట్రపతి ప్రణబ్

రాష్ట్రప‌తి ప్రణబ్‌ ముఖ‌ర్జీ నేటి నుంచి ఈనెల 31వ తేదీ వ‌ర‌కు హైదరాబాద్‌లో గడపనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ బస చేస్తారు. ఈ 14 రోజుల్లో ప్రణబ్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిసెంబ‌ర్ 19న సికింద్రాబాద్‌లోని మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ స్నాత‌కోత్సవంలో రాష్ట్రప‌తి పాల్గొంటారు.

20మంది అంగన్‌వాడీలకు అస్వస్థత

అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అంగన్‌వాడీల ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సిఎం క్యాంపు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో 20 మంది అంగన్‌వాడీలు అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీకి మద్దతు తెలిపిన సిపిఎం, సిఐటియు నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

హెరాల్డ్‌కేసులోకోర్టుకు సోనియా

నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ రేపు పాటియాలా హౌజ్‌ కోర్టులో హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సోనియా గాంధీ ధృవీకరించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో వారు ఇంతవరకు బెయిలు బాండ్‌ నింపలేదు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

GST పై ప్రతిష్టంభన తొలగేనా..?

జిఎస్‌టి బిల్లును ఆమోదించేలా ఏకాభిప్రా యాన్ని తీసుకు రావడంలో శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశం విఫలమైంది. జిఎస్‌టి బిల్లుపై రాజ్యసభలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రాజ్యసభ చైర్మన్‌ హమిద్‌ అన్సారీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో జిఎస్‌టి బిల్లుకు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, పెండింగ్‌లో వున్న మిగిలిన ఆరు బిల్లులను చివరి మూడురోజుల సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలు సహకరిస్తామన్నాయి. గంటపాటు సాగిన చర్చల అనంతరం అన్సారీ మాట్లాడుతూ సమావేశం సానుకూలంగా సాగింద న్నారు.

నేడు శాసనసభలో ఐదు బిల్లులు..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రభుత్వం ఇవాళ 5బిల్లులు ప్రవేశపెట్టింది. మౌలిక సదుపాయల అభివృద్ధి సవరణ బిల్లు, విద్యుత్‌ సుంకం బిల్లు, నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారీటైమ్‌ బోర్డు బిల్లు, విలువ ఆధారిత పన్ను, విదేశీ మద్యం సవరణ బిల్లులను ప్రభుత్వం స్పీకర్‌ అనుమతితో సభలో ప్రవేశ పెట్టింది. వైకాపా సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

ప్రజలకు ప్రయోజనమేదీ? :ఏచూరి

ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతున్నా మనదేశంలో ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలకు ఆ ప్రయోజనాలు అందటంలేదని సిపిఎం విమర్శించింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు నానాటికీ తగ్గుతున్నాయని, ప్రస్తుత గతంలో కంటె మూడు రెట్లు ధరలు పడిపోయాయని చెప్పారు. అయితే నరేంద్రమోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను తొమ్మిదిసార్లు పెంచివేసిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిమితి దాటిన ఉత్పత్తి, అమెరికన్‌ డాలర్‌ ప్రభావంతో క్రూడాయిల్‌ ధరలు పడిపోతున్నాయని ఆయన గుర్తుచేశారు.

కాల్‌మనీపై అసెంబ్లీలో రగడ..

శీతాకాల సమావేశాల శుక్రవారం రెండోరోజున కూడా కాల్‌మనీ వ్యవహారంపై అధికారప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ నడిచింది.మధ్యాహ్నం సభలో సిఎం కాల్‌ మనీపై ప్రకటన చేశారు. సిఎం ప్రకటన చేస్తుండగా ప్రతిపక్షసభ్యులు ఆయన స్థానం వద్దకు వెళ్ళి అడ్డు తగలడంతో సభలో గందరగోళం చెలరేగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ మార్మోగింది. వైఎస్‌ ఆర్‌ సి పి సభ్యురాలు రోజా సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సభనుంచి ఆమెను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వమే ఓ భూకబ్జాదారు:కారత్

రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో టిడిపి ప్రభుత్వమే భూకబ్జాదారుగా మారిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. భూసేకరణ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాల, బ్రాహ్మణపల్లె, గడివేముల మండలం గని గ్రామాల్లో సోలార్‌ హబ్‌ కింద భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడేందుకు శుక్రవారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాలకు సంబంధించిన భూసేకరణలో ఎక్కడ భూసేకరణ జరిగినా 80 శాతం మంది నిర్వాసితులు గ్రామసభలో ఒప్పుకోవాలనే నిబంధన ఉందన్నారు.

అంగన్వాడీలకు అండగా...

పోరాటానికి మరో పేరు అంగన్ వాడీలని వామపక్ష నేతలు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు శుక్రవారం చలో బెజవాడకు భారీ ర్యాలీని చేపట్టారు. తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మగాంధీ రోడ్డు వరకు చేరుకోగానే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలను ఇష్టమొచ్చినట్లు లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, న్యాయంగా జారీ చేయాల్సిన జీవోను జారీ చేయాలని కోరుతున్నారన్నారు.

Pages

Subscribe to RSS - December