ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం లౌకిక రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.. యాగం ఖర్చులపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మూఢ విశ్వాసాలను పెంచే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఆర్థిక..సామాజిక సమస్యలపై దృష్టి మళ్లించకుండా మూఢ విశ్వాసాల చుట్టూ దృష్టి మళ్లించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారని తెలిపారు.