బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిర్భయ ఘటన జరిగిన మూడేళ్ల అనంతరం జువైనల్ చట్టాన్ని సవరించింది. బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. డిప్యూటి ఛైర్మన్ క్లాజుల వారీగా ఓటింగ్ ను నిర్వహించారు. ఓటింగ్ సమయంలో రాజ్యసభలోనే నిర్భయ తల్లిదండ్రులున్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపనందుకు నిరసనగా సభ నుండి సీపీఎం వాకౌట్ చేసింది. చట్టంలో సవరణలను ఎన్ సీపీ, సీపీఎం వ్యతిరేకించింది. చట్టం మరింత ప్రయోజనకరంగా ఉండాలని సీపీఎం పేర్కొంది...