
రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) నేతలపై ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు విరుచుకుపడ్డాయి. జనవరిలో నిర్వహించనున్న అఖిలభారత మహాసభలకు అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా భయోత్పాతం సృష్టించాయి. ఈ దాడిలో సీకర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుభాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తలకు 25 కుట్లుపడ్డాయి. అయితే సంఫ్‌ు శక్తులకు పోలీసులు తోడయ్యారు. ఫీజులు తగ్గించాలని అడగడమే నేరమైనట్టు.. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అడగడమే తప్పయినట్టు.. సీపీఐ(ఎం) కార్యాలయంలోకి చొరబడి మరీ ఎస్ఎఫ్ఐ నాయకులను సోమవారం చితకబాదారు.