December

వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ..

చెన్నై వరద బాధితుల సహాయార్థం విజయవాడలో సీపీఎం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టింది.  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య, సిహెచ్ .బాబురావు, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్ పలువురు సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.. తాగేందుకు మంచినీళ్లు కూడా లేని చెన్నై వాసులకు ప్రతీ ఒక్కరు మానవతా హృదయంతో సహాయం చేయాలని కోరారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వరద బాధితుల కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు.

తమిళనాడుకి ఒడిశా 5 కోట్ల సాయం

భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడు రాష్ట్రానికి ఒడిశా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు రాష్ట్ర మంత్రి విక్రం అరుఖ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిన్న తమిళనాడు సీఎం జయలలితతో మాట్లాడినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత ప్రజలను ఆదుకునేందుకు, సహాయ చర్యల నిమిత్తం తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

ఖమ్మంMLCఅభ్యర్ధిగా పువ్వాడ

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాల అభ్యర్ధిగా సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వరరావును ఆ పార్టీ ప్రకటించింది. పువ్వాడ రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పువ్వాడ అభ్యర్ధిత్వానికి ఇతర ప్రతిపక్షాలు కూడా మద్దతు ప్రకటించే అవకాశముందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు.

దళితులకి కేవలం 0.2% నిధులే..

దేశవ్యాప్తంగా సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్లుతున్నాయని, దళితుల సంక్షేమానికి ఖర్చు చేసేది కేవలం 0.2 శాతం నిధులేనని ఎస్‌సి జాతీయ కమిషన్‌ సభ్యురాలు పిఎం.కమలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ సబ్‌ప్లాన్‌ నిధులు ఎంత కేటాయించారు?, ఎంత ఖర్చు చేశారు?, ఎంత మిగిలిందనే లెక్కలు ఉండటం లేదన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతికి నివేదిక అందజేసి, నిధులు సక్రమంగా వినియోగించేలా కమిషన్‌ తరుపున సూచిస్తామన్నారు. 

చింతమనేనిని బర్తరఫ్‌ చేయాలి..

 ఆంగన్‌వాడీ కార్యకర్తలను దూషించిన ప్రభుత్వ చీఫ్‌విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. గురువారం కడప పాతబస్టాండ్‌లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కోశాధికారి శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి ఐ.ఎన్‌.సుబ్బమ్మ మాట్లాడుతూ ఏలూరులో చింతమనేనికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన అంగన్‌వాడీల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. గతంలో తహశీల్దార్‌ వనజాక్షి పట్లా ఇలాగే ప్రవర్తించారని గుర్తుచేశారు.

Pages

Subscribe to RSS - December