December

వరదబాధితులకు3లక్షల విరాళం:మధు

 వరద బాధితుల సహాయార్థం ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈనెల ఐదో తేదీన పార్టీ శాఖలన్నీ ప్రజల నుంచి విరాళాలు సేకరిం చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. తమిళనాడుతో పాటు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతా లలో బాధితుల సహాయార్థం సిపిఎం రాష్ట్ర కమిటీ రూ.3 లక్షలు విరాళాన్ని పంపుతున్నట్లు గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

మతోన్మాదానికి వ్యతిరేకంగా ర్యాలీ..

మతోన్మాదానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని సరస్వతీ పార్కు నుంచి దాబాగార్డెన్స్ మీదుగా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. అయితే సెక్షన్-30, 31 అమలులో ఉన్నాయని, ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే పక్కనే సరస్వతీ పార్కు వద్ద టీడీపీ జన చైతన్యయాత్ర పేరిట ర్యాలీలు తీస్తున్నారు కదా అని వామపక్షాల నేతలు ప్రశ్నించగా పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రాముడితో రాజకీయాలా? :నితీశ్‌

 బీహార్‌ ముఖ్యమత్రి నితీశ్‌ కుమార్‌ కుమార్‌ బీజేపీపై మండిపడ్డారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ నేతలు రామాలయం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇందుకు సంబంధించి కోర్టు విచారణ తేదీలు కూడా వారికి గుర్తుండవు' అని నితీశ్‌ విమర్శించారు. రెండు వర్గాల మధ్య సమగ్ర చర్చలు జరిగినప్పుడు మాత్రమే అయోధ్యలో రామాలయ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

రాష్ట్రపతికి బృందాకరత్‌ వినతి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యం ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలను పూర్తిగా ఆపేయాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం బాక్సెట్‌ తవ్వకాల ప్రక్రియను వేగవంతం చేస్తోందని, దానిని వెంటనే ఆపాలని కోరుతూ ఆమె ఒక వినతి పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందజేశారు.

రెవెన్యూ లోటుతో అల్లాడుతున్నAP

రాష్ట్రం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతూనేఉన్నాయి.. తొలి ఆర్థిక సంవత్సరంలో ప్రధాన శాఖలన్నీ 90శాతం ఆదాయాన్ని మాత్రమే చేరుకున్నాయి... మిగతా శాఖల పరిస్థితి దాదాపు అలాగే ఉంది..... రాబోయే బడ్జెట్‌లోగా ఈ సమస్యల పరిష్కరించాలని ఏపీ సర్కారు తీవ్రంగా కృషి చేస్తోంది.. బడ్జెట్‌ అంచనాలపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7వేల కోట్ల రూపాయలవరకూ ఆదాయం తగ్గిందని అంచనావేశారు.. స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖ, మైన్స్, అట‌వీ శాఖ‌లు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాయి..

తమిళనాడుకి వెయ్యి కోట్ల సాయం..

తమిళనాడు లో వరద ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళనాడు ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 940 కోట్ల సాయం ప్రకటించామని, మరో రూ.1000 కోట్ల సాయాన్ని మోదీ ప్రకటించారు.

మోడీని టార్గెట్ చేసిన ISIS..

ISIS తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో భారత ప్రధాని మోడీని టార్గెట్ చేసారు.ముస్లింలపై హిందువులను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు.

 

పెద్దల సభలో కులం రగడ..

గుజరాత్‌లోని ఓ ఆలయంలో తనను కులం అడిగారంటూ కాంగ్రెస్‌ ఎంపి కుమారి షెల్జా చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కుమారి షెల్జా మాట్లాడుతూ..తాను యుపిఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్నపుడు గుజరాత్‌లోని ద్వారక ఆలయాన్ని సందర్శించానని, ఆ సమయంలో తన కులమేమిటని అక్కడి నిర్వాహకులు అడిగినట్టు ఆమె తనకెదురైన అనుభవాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా గుజరాత్‌ నమూనానే అనుసరిస్తోందంటూ ఆమె విమర్శించారు.

కోట్ల రూపాయల సౌర కుంభకోణం!

కేరళలో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల సౌర కుంభకోణంలో అనేక వాస్తవాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ కుంభకోణంలో నిందితురాలయిన టీమ్‌ సోలార్‌ సంస్థ యజమాని సరితా ఎస్‌ నాయర్‌తో ముఖ్య మంత్రి ఊమెన్‌ చాందీ వివాహేతర సంబంధాలను కొనసా గించారని, అంతేకాక ఈ కుంభకోణంలో తాను ముఖ్య మం త్రికి రు.5.5 కోట్ల ముడుపులు అందచేశానని ప్రధాన నింది తుడైన బిజు బాలకృష్ణన్‌ అలియాస్‌ ఆర్‌కె నాయర్‌ జుడిష ియల్‌ కమిషన్‌కు తెలిపారు. సంచలనాత్మకమైన ఈ విషయా లకు సంబంధించిన ఆధారాలు పొందుపర్చిన సిడిని ఆయన బుధవారం కమిషన్‌కు అందచేశారు.

Pages

Subscribe to RSS - December