రాజధాని ప్రాంతంలో పర్యటన..

రాజధాని ప్రాంతంలో అభద్రతా భావం పెరుగుతోందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, గుంటూరు కార్యదర్శివర్గ సభ్యులు జొన్న శివశంకరరావు, రాధాకృష్ణ, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవితో కలిసి శ్రీనివాసరావు సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు.సింగపూర్‌ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. తప్పులకు అధికారులను బలిపశువులు చేస్తూ మంచిని మాత్రం మంత్రులు తమకు ఆపాదించుకుంటున్నారని తెలిపారు. సమీకరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో 40 వేల మంది వ్యవసాయ కార్మికులుంటే కేవలం 16 వేల మందే పింఛన్లకు అర్హులుగా పేర్కొంటోందన్నారు. వీరికీ మూడు నెలలుగా పింఛన్ల అందటంలేదన్నారు. సమీకరణకు భూమి ఇవ్వని రైతుల పంటను దున్నేయటం తీవ్రమైన నేరమన్నారు.