అంగన్వాడీలకు అండగా...

పోరాటానికి మరో పేరు అంగన్ వాడీలని వామపక్ష నేతలు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు శుక్రవారం చలో బెజవాడకు భారీ ర్యాలీని చేపట్టారు. తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మగాంధీ రోడ్డు వరకు చేరుకోగానే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలను ఇష్టమొచ్చినట్లు లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, న్యాయంగా జారీ చేయాల్సిన జీవోను జారీ చేయాలని కోరుతున్నారన్నారు. ఏసీ గదుల్లో ఉండడం కాదు..వారి కోపాన్ని తట్టుకొనే శక్తి ఉందా అని బాబును ఉద్ధేశించి హెచ్చరించారు. వేతనాలు పెంచుతామని, పెన్షన్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పారని గుర్తు చేశారు. అనంతరం మొండిచేయి చూపారని, అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. సీఎం కార్యాలయం లోనికి వందలాది మంది కార్యకర్తలు వెళ్లిపోయారని, అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.