కేంద్ర పర్యాటకా ప్రాజెక్టుల కోసం ధరణికోట సత్తెనపల్లి రోడ్డులో ప్రభుత్వం 50 ఎకరాల భూ సేకరణ చేపడుతుందనే వార్తల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది.. నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించడంతో అమరావతిలో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల ధరలు ఎకరం సుమారు రూ.4 కోట్ల వరకు పలుకుతున్నాయి. ప్రభుత్వం భూ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే 30 లక్షల కంటే మించి పరిహారం వచ్చే అవకాశాలు లేకపోవడంతో భూ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిని వారసత్వ నగరంగా ఎంపిక చేసి నిధులు మంజూరు చేయడంతో అమరావతి అభివృద్ధికి భూమిని సేకరించి పర్యాటక ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇటీవల...
District News
ప్రభుత్వ బలవంతపు భూసేకరణను నిరసిస్తూ రాజధాని ప్రాంతం పెనుమాక రైతులతో వామపక్ష్య నాయకులు సమావేశమయ్యారు.ఈసమావేశానికి రైతులు భారీగా తరలివచ్చారు.ఎలాంటి పరిస్థితిలో భూములు ఇచ్చేది లేదని రైతులు తేగేసి చెప్పారు. సిపియం రాష్ర్ట కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వయంగా ప్రభుత్వం చేయడం సిగ్గుచెటన్నారు.ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవాలని చూస్తే రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాజధాని ప్రాంతం నుండి పేదలను, దళితులను తరిమివేసేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని ఈ కుట్రలకు వ్యతిరేకంగా పేదలంతా ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి రైట్స్ అండ్ యాక్ట్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం దళిత దీక్ష జరిగింది. ఈ దీక్షను బిఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌డిఈ దుంగా రత్నప్రదీప్ ప్రారంభించారు. దీక్షనుద్దేశించి రవి మాట్లాడుతూ రాజధానిలో దళితులకు స్థానం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దళితుల పట్ల పాలకులు వివక్షత చూపుతున్నారని దళితులుగా ఉన్న అసైన్డ్ సాగుదారులకు కౌలు చెక్కులు ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు...
దేశంలో అమలవుతున్న సరళీకరణ విధానాల ద్వారా వ్వవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారంబ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయం లో ఎపిరైతుసంఘం, వ్వవసాయక ార్మికసంఘం సంయుక్త అధ్వర్యంలో రైతుసంఘంజిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ అధ్యక్షతన రౌండ్‌టెబుల్ సమావేశం నిర్వహించారు. వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .రైతుల అత్మహత్యలు పెరుగుతున్నాయని, వ్వవసాయ పనులు లేక రైతులు, రైతుకూలీలు, వలసలు వెళ్తున్నారన్నారు. గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తూట్లు పోడుస్తున్నాయని విమర్శించారు. .రైతుల భూములను లాక్కోవటం కోసమే 2013 భూసేకరణ చట్టాన్ని మార్పుచేస్తూ మోడీ ప్రభుత్వం...
ఏళ్లతరబడి సాగు చేసుకొంటున్న భూములను పేదల నుంచి బలవంతంగా తీసుకునే సత్తా ప్రభుత్వంతోపాటు ఎవరికీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రభావిత ప్రాంతాలైన సన్యాసిరాజుపేట, ఓదిపాడు, తోటాడ గ్రామాల్లో శుక్రవారం ఆయన పరిశీలించారు. పోలాకి మండల కేంద్రంలో రైతులతో మాట్లాడారు. జిఒ 1307 ప్రకారం బలవంతంగా భూములు లాక్కోవడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 35 థర్మల్ ప్రాజెక్టులున్నాయని, రాష్ట్రావసరాలకు సరిపడా విద్యుదుత్పత్తి ఉండగా, ఇంకా కొత్త పవర్ ప్లాంట్ల అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
రాజధాని గ్రామాల్లో భూ సేకరణకు తాత్కాలికంగా స్వస్థిపలుకుతూ సమీకరణ ద్వారానే భూములు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 20న జారీ చేసిన నోటిఫికేషన్లను నిలిపివేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా సిపిఎం ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పలు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించింది. సిఆర్‌డిఎ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ప్రకాశం బ్యారేజిపై రాస్తారోకో, నిరసన ప్రదర్శనలతో ప్రభుత్వం చర్యలకు నిరసనగా ప్రజలను సమాయత్త పరచటంలో సిపిఎం గత కొంత కాలంగా పోరుబాట నిర్వహిస్తుంది. ఈ నేపధ్యంలో గ్రామాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని, నిఘావర్గాలు హెచ్చరించటం, అంశాంతి వాతావరణం మధ్య రాజధాని నిర్మాణం ముందుకు సాగదని భావించిన ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రభుత్వానికి...
ఉల్లి, కందిపప్పు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. వీటి ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం రాస్తారోకోలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు, కందిపప్పు ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయని, వాటిని అదుపుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. రైతు బజార్లలో ఉల్లి రూ.20 చొప్పున అమ్మకాన్ని నామ మాత్రం గానే ప్రారంభించారని, వీటికోసం భారీ క్యూలు ఉంటున్నాయని కొందరు మహిళలు సొమ్మసిల్లిపోతు న్నారని వెల్లడించారు. ఈ ఘటనలు మీడియాలో వస్తున్నా సరుకు సరఫరాలకు చర్యలు లేవని పేర్కొన్నారు. ఇప్పటికైనా...
ప్రభుత్వం ప్రయివేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.లక్ష్మణరావు ఆరోపించారు. ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ శనివారం విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రయివేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయటం కోసం కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపిందన్నారు. దీనిని ఎస్‌ఎఫ్‌ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జిల్లాకి ఒక ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించకుండా ప్రయివేట్ యూని వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలపటం సరైన విధానం కాదన్నారు. ప్రయివేట్...
రాష్ట్ర విభజన సందర్భంగా బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకేంద్రంగా రైల్వేజోన్ వంటివి అనేక వాగ్ధానాలు ఇచ్చింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బిజెపి మాటతప్పింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి ప్రభుత్వం చెపుతుంటే కేంద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై అఖిలపక్షాల మద్దతు తీసుకొని ఒత్తిడి తేవడంలో విఫలమయ్యింది. నేడు ప్రత్యేక హోదాకై వామపక్షపార్టీలు బంద్ నిర్వహిస్తే దానికి సహకరించాల్సిన ప్రభుత్వం పోలీస్ బలగాలను ఉపయోగించి అక్రమంగా అరెస్టు చేయించడం అత్యంత దుర్మార్గం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండివైఖరి వీడాలని...
'నా రెక్కలు విరవని నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు' అని చెప్పిన స్వేచ్ఛాజీవి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జారు మహిళా విద్యకు, ప్రపంచశాంతికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. మలాలాను, ఆమె తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. స్థానిక వింజనంపాడులోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సంయుక్తంగా కళాశాలలో శుక్రవారం మలాలా స్వీయ గాధను తెలియచేస్తూ ' నేను మలాలా' పేరుతో ముద్రించిన పుస్తకాన్ని వేలాది మంది విద్యార్థులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కళాశాల చైర్మన్ కోయ సుబ్బారావు అధ్యక్షత వహించారు. సభలో ప్రముఖ సాహితీ వేత్త, నాగార్జునా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్...