2015 సెప్టెంబరు 2
దేశంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు మేం వ్యతిరేకం అని కార్మికవర్గం చాటిచెప్పింది. నేడు దేశవ్యాపితంగా అఖిలభారత సమ్మెలో విశాఖనగర కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేసింది.
నేడు విశాఖనగరంలో తెల్లవారి జామున 5 గంటలకే ఆటో కార్మికులు బంద్‌ను నిర్వహించడంతో బంద్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వరంగ పరిశ్రమల్లో పూర్తిగా సమ్మె జరిగింది. చివరకు ప్రైవేట్ గంగవరం పోర్టులో కూడా కార్మికులు సమ్మెలో పాల్గొని యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిబడ్డారు. ముఠా, ఆటో, బిల్డింగ్, తోపుడుబండ్లు, జివిఎంసి పారిశుధ్యకార్మికులతో...
District News
సెప్టెంబర్ 2 దేశవాపితంగా కార్మికవర్గం చేపడుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నాయకత్వంలో భారీ స్కూటర్ ర్యాలీ జరిగింది. ఈ స్కూటర్ ర్యాలీ జివిఎంసి కార్యాలయం వద్ద ప్రారంభమై జగదాంబ, కలెక్టర్ ఆఫీస్, చౌట్రీ, పూర్ణామార్కెట్, కొత్తరోడ్, రైల్వేస్టేషన్, గురుద్వార్, హెచ్.బి.కాలనీ, వెంకోజీపాలెం, ఎం.వి.పి., మద్దిలపాలెం, కాంప్లెక్స్ మీదుగా జగదాంబ సిఐటియు కార్యాలయం వరకు జరిగింది. సుమారు 40 కిలోమీటర్లు తిరిగారు. సెప్టెంబరు 2న సరస్వతీ పార్కు నుండి ఉదయం 10 గంటలకు ప్రదర్శన ఉంటుందని దీనిలో పెద్ద ఎత్తున కార్మికవర్గం పాల్గొవాలని సిఐటియు నగర కార్యదర్శి ఎం.జ...
2015 ఆగస్టు 31
పట్టణప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్న వారి ఇళ్ళను 100 చదరపు గజాలు వరకూ క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలుగుదేశం ప్రభుత్వం 12-8-2015న జివోనెంబర్ 296ను విడుదల చేసింది. ఈ జివో ప్రకారం పేదలు ఆగష్టు 15 నుండి దరఖాస్తును ‘మీసేవా’ ద్వారా తహశీల్ధార్ కార్యాయాలకు పంపించుకోవాలని తెలియజేసింది. జివో విడుదలై 15రోజులు దాటినప్పటికీ ‘మీసేవా’లో ఇళ్ళ క్రమబద్ధీకరణ దరఖాస్తు ఇవ్వటం గాని లేదా తీసుకోవటం గాని జరగటం లేదు. ఇప్పటివరకు విధి విధానాలను కూడా ప్రజలకు తెలియజేయలేదు. ఫలితంగా విశాఖనగరంలో ప్రభుత్వ భూముల్లో సుమారు 70వేమంది ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్నప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై...
2015 ఆగష్టు 31
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు నిరసనగా సిపియం గ్రేటర్ విశాఖనగర కమిటీ ఆధ్వర్యాన కార్యకర్తలు సోమవారం మద్దిపాలెం జంక్షన్‌లో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసారు. బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక భారీగా ప్రజలపై భారాలు పడుతున్నాయి. ధరలు పేద, సామాన్యుడుకి అందని ద్రాక్షగా ఉంది. ఉల్లి, కందిపప్పు ధరలు ఇక చెప్పనవసరం లేదు. దళారులు, పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వాలు దాసోహం చేస్తున్నాయి. ఉల్లిపాయలు సబ్సిడీ ద్వారా 20 రూ॥కే అందజేస్తున్నామని ప్రభుత్వం భారీగా ప్రకటనలు చేస్తోంది. కాని రైతు బజార్ల ద్వారా తెల్లరేషన్‌కార్డు ఉంటేనే ఇస్తున్నారు. ఆ...
1. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించింది. 2008లో దేవస్థానం 419 ఉన్న ఇళ్ళ నిర్మాణాలపై సర్వే చేసిన వాటి ఆధారంగా 12149 ఇళ్ళను క్రమబద్దీకరణ చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. 60చ॥గజాల వరకు ఉచితంగా, 61-300 చ॥గజాల వరకు 1998 నాటి భూ మలువలో 70శాతం మరియు 9శాతం వడ్డీ, 301 చ॥గజాల పైబడిన వాటికి (రెండోకేటగిరి విలువ మరియు) ప్రస్తుత భూ విలువపై గృహయజమానులు ప్రభుత్వానికి డబ్బుచెల్లించి క్రమబద్దీకరించుకోవాలని ప్రభుత్వ క్యాబినెట్ ప్రకటించింది.
2. ప్రభుత్వం ప్రకటించిన పరిష్కారం ప్రజల దగ్గర నుండి డబ్బు గుంజి ఖజానా నింపుకునేలా ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) భావిస్తున్నది. ఆ భూములపై...
ఈ రోజు సిపియం పార్టీ నాయకులు లాజిస్టిక్ హబ్ భూ సాగుదార్లు, జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్‌ను కలిసి నష్టపరిహారం విషయంలో సాగుదార్లుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నరసింగరావు, జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యన్నారాయణ, గ్రామాల రైతులు పాల్గొన్నారు.ఈ విషయంపై కలెక్టర్ స్పందించి భూ సాగుదార్లు అందరికీ చట్టం ప్రకారం రావల్సిన పరిహారాన్ని, బాధిత కుటుంబాలకు కూడా న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
‘‘లాజిస్టిక్ హబ్’’ కు మునగపాక, పరవాడ, అనకాపల్లి రూరల్ మండలాల్లోని (వెంకటాపురం, రామానాయుడుపేట, తానాం, తాడి, మ్లారు, ఎరుకువానిపాలెం...
పంచగ్రామాల భూసమస్యపై టిడిపి ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించడాన్ని సిపిఎం స్వాగతిస్తోందని ఆ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు అన్నారు. కేబినెట్ ప్రకటనతో కేవలం 12149 మందికే ఉపశమనం లభిస్తుందని, మరింత ఉదారంగా వ్యవహరించి జిఒ జారీ చేస్తే ఎక్కువ మంది పేదలకు న్యాయం జరగుతుందన్నారు. 60 గజాల లోపు వరకు ఉన్న నివాసాలను మాత్రమే ఉచితంగా క్రమబద్ధీకరించి, మిగిలిన వాటిని వర్గీకరించి డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. అక్కడితో ఆగకుండా 61 నుంచి 300 గజాల వరకు 1998 నాటి భూ విలువలో 70 శాతం డబ్బులపై 9 శాతం వడ్డీ కట్టాలని ప్రకటించడం సబబు కాదన్నారు. సోమవారం ఉదయం విశాఖ జిల్లా సిపిఎం కార్యాలయంలో నగర కార్యదర్శి బి.గంగారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు...
రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకే అప్పగించాలంటే అందుకు ప్రతిగా అవి వాటికోసం కోరుకున్న భూములనూ సర్వ హక్కులతోనూ ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. కంపెనీల షరతులు:తమకు కేటాయించే భూములపై పూర్తి హక్కులూ తమకే అప్పగించాలని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేవని రాజధాని నిర్మాణం చేపట్టదలచిన కంపెనీలు తెలిపినట్లు తెలిసింది. 99 సంవత్సరాల లీజు పద్ధతిలో ఇచ్చినా భూమిపై హక్కులు తమకే ఉండాలని, అందుకు అవసరమైన డాక్యుమెంట్లున్నీ అప్పగించాలని సింగపూర్ ప్రతినిధులు షరతు పెట్టినట్లు సమాచారం. రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వడానికి వీలులేని పద్ధతిలో అగ్రిమెంట్లు చేయించుకుంటున్న ప్రభుత్వం వాటినే...
రాష్ట్రంలో ప్రభుత్వం 15 లక్షల ఎకరాలు రైతుల నుంచి గుంజుకొని కార్పొరేట్ శక్తులకు అప్పగించే యత్నాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు డిమాండ్ చేశారు. గురువారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రాజధాని పేరుతో 53 వేల ఎకరాలు సేకరించాలని 45 వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని కోసం మొత్తం 1.40 లక్షల ఎకరాల భూములు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. దేశం వ్యవసాయక దేశమని, 120 కోట్ల జనాభాకు ఆహార పదార్ధాలు అందించాల్సిన గురుతర...
రాయలసీమ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఉన్న జిఒ నంబరు 120ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహమ్మద్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌లో సర్కిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీ వైద్యకళాశాలలో సీమ విద్యార్థులకు 80శాతం, ఇతరులకు 20శాతం సీట్లు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం కొత్తగా జిఒ నంబరు 120 తీసుకు వచ్చి లోకల్‌కు 20శాతం, నాన్‌లోకల్‌కు 80శాతం సీట్లు కేటాంచే విధంగా అవకాశం కల్పించారని విమర్శించారు. రాష్ట్ర విభజనలో కోర్టు యాదావిధిగా కొనసాగించాలని చెప్పినా ప్రభుత్వం ధిక్కరించిందని తెలిపారు...