District News

ప్రభుత్వం తలపెట్టిన బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఇచ్చిన బంద్‌ పిలుపు ఉండవల్లిలో సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుండే దుకాణాలన్నీ మూతపడ్డాయి. పెట్రోలు బంకుతో సహా పెద్ద వ్యాపారసంస్థలన్నీ స్వచ్ఛంధంగా బంద్‌చేసి రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ముందుగా సిపిఎం, వైసిపి నాయకులతో కలిసి రైతులు ఉండవల్లి సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిడా సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశత్వంగా ముందుకెళితే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా భూసేకరణను నిలుపుదలచేస్తామని చెప్పారు. మెరుగైన ప్యాకేజీ అంటూ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాజధానికి భూములు...

కోరంగి భూముల ఘటనపై న్యాయం చేయాలని ఎస్‌పి రవిప్రకాష్‌, ముమ్మిడివరం ఎంఎల్‌ఎ దాట్ల బుచ్చిబాబు, కాకినాడ ఆర్‌డిఒ అంబేద్కర్‌లను అఖిలపక్షం నాయకులు మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, దళిత సంఘాల నాయకుల బృందం ముమ్మిడివరం ఎంఎల్‌ఎను కలిసి ఘటనా వివరాలను, పేదలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనికి స్పందించిన ఆయన పోలీసుల అత్యుత్సాహంపై ఎస్‌పితో మాట్లాడారు. ఆర్‌డిఒకు ఫోన్‌ చేసి భూములపై సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని విచారణ నిర్వహించాలన్నారు. 

సెప్టెంబర్‌ 2న జరిగే సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా హిందూపురంలో ప్రారంభమైన బస్సు జాతా సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాలయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించింది.

 

 రాజధాని ప్రాంతంలో గ్రామకంఠాలు, భూసేకరణపై సిపిఎం ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని ఉండవల్లి, నవులూరుల్లోని క్రిడా కార్యాలయాలను స్థానికులు సోమవారం ముట్టడించారు. తుళ్లూరు మండలం దొండపాడులోని క్రిడా డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయానికి రాజకీయాలకతీతంగా రైతులు తాళాలేశారు. గ్రామకంఠాల పేరుతో గ్రామాలను ఖాళీ చేయాలనే కుట్ర జరుగుతోందని నినదిస్తూ అధికారులను ఘెరావ్‌ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ, గ్రామాలను ఖాళీ చేయించేందుకే ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు.
తొలుత గ్రామకంఠంలోని కొన్ని ఇళ్ళను తొలగించి ఆ తరువాత గ్రామాన్ని ఖాళీ చేయించడానికి చేస్తున్న...

ఈ రోజు విశాఖ జిల్లా డి.సి.ఒ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో కె. లోకనాధం మాటలాడుతూ పి.ఎ.సి.ఎస్ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలన్నారు. డి.సి.సి.బి నియామకాల్లో పి.ఎ.సి.ఎస్ కోట కొనసాగించాలని, రిటైర్ మెంట్ 60 సంవత్సరాలకు పొడిగించాలన్నారు.  పి.ఎ.సి.ఎస్ ఉద్యోగుల పోరాటాలకు సిపియం పార్టీ  ఎప్పుడు తన మద్దతు ఉంటుందని తెలియజేసారు. ప్రభుత్వం వెంటనే పి.ఎ.సి.ఎస్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు ....

ఉద్యోగుల డిమాండ్లు ...

సహకార సంఘాల (PACS) ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి .. సహకార సంఘాల ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి .... డి.సి.సి.బి ఉద్యోగ నియామకాల్లో పి.ఎ.సి.ఎస్ లకు ఇచ్చిన కోట కొనసాగించాలి ....
...

 ప్రభుత్వం నిత్యవసర ధరలు తగ్గిం చాలని కర్నూలు సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  రాష్ట్రానికి, దేశానికి ఉల్లిని సరఫరా చేసే కర్నూలులోని బహిరంగ మార్కెట్‌లో ధర రూ.50లు పలుకుతుందని, కందిపప్పు కిలో రూ.100లకు దాటిపోయిందని, కూరగాయలు కొనలేని పరిస్థితిల్లో సామాన్యులు ఉన్నారని తెలిపారు.

రాజధాని భూసేకరణ నోటిపికేషన్‌ను వ్యతిరేకిస్తూ వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతు, ప్రజా, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా అరెస్ట్‌లు చేశారు. అరెస్టు అయినవారిలో సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, జె శివశంకర్‌, రవి, నవీన్‌, రైతు సంఘం నాయకులు గంగాధరం తదితరులున్నారు. వీరిపై 341, 143 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. రాస్తారోకో ప్రారంభం కాకముందే చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఖాకీల ప్రయత్నాలను ప్రతిఘటిస్తూ వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలు ఆందోళనను ప్రారంభించారు. భూసేకరణ...

రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణపై రోజు రోజుకు నిరసనలు పెరుగుతున్నాయి. పలు గ్రామాల్లో రైతులు వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతులు సమావేశమై ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ, భూసేకరణను వ్యతిరేకిస్తూ నేడు ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ మీద రాజధాని గ్రామాల రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులతో రాస్తారోకో నిర్వహించారు.  ఈనెల 24న రాజధాని గ్రామాల్లోని క్రిడా కార్యాలయాలను ముట్టడించాలని, 25న రాజధాని ప్రాంత గ్రామాల్లో బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు..

 

టిడిపి ప్రభుత్వం విలీన మండలాలపై తీవ్ర వివక్షను చూపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. కృష్ణమూర్తి విమర్శించారు. సిపిఎం కూనవరం డివిజన్‌ కమిటీ సమావేశం తూర్పుగోదావరి జిల్లా కూనవరం ఫారెస్టు అతిథి గృహంలో కుంజా సీతారామయ్య అధ్యక్షత న శనివారం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మా ట్లాడుతూ, ఉపాధ్యాయులు లేక విలీన మండలాల్లో ప్రభు త్వ విద్య మరుగున పడిందన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో గిరిజనులకు వైద్యం దూరమైందన్నారు. మలే రియాతో గిరిజనులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఏడు మండ లాలు విలీనమై 16 నెలలైనా ఒక్క అభివృద్ధి పని కూడా జరగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పోలవరంలో తాగునీరు లేక ప్రజలు...

Pages