District News

రాజధాని ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం కార్యకర్తలు నిత్యం పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల సిహెచ్‌.బాబురావు కోరారు. ఉండవల్లి సిపిఎం కార్యాలయంలో సోమవారం జొన్నకూటి వీర్లంకయ్య అధ్యక్షతన సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పట్ల ఉద్ధేశ్యపూర్వకంగానే వివక్ష చూపుతుందని విమర్శించారు. అందుకు పేదలకు ఇవ్వవలసిన పింఛన్లు సరిగా ఇవ్వకపోవడమేనని విశ్లేషించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీనత రోజురోజుకు పెరుగుతుందని మండిపడ్డారు. లంక గ్రామాల విషయంలో అధికారులు, మంత్రులు పొంతనలేని విధంగా మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసైన్డ్‌, సీలింగ్‌...

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గత ఒకటో తేదీ నుంచి కొనసాగిన సిపిఎం ప్రచారాం దోళన శుక్రవారం కలెక్టరేట్లు, తహశీలుదార్లు, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద జరిగిన ధర్నాలతో పరాకాష్టకు చేరింది. ఉదయం నుంచే సిపిఎం శ్రేణులు, ప్రజలు ఆయా రెవెన్యూ కార్యాలయాలకు చేరుకొని సమస్యలపై పెద్దపెట్టున నినదించారు. అధి కారులకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సాగిన ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, రాష్ట్రకమిటీ సభ్యులు, ఆయా జిల్లాల కార్యదర్శులు, సిపిఎం శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వానికి ప్రజా సమస్యలను వివరించారు. బడ్జెట్‌ సమావేశాలలోపు ప్రజాసమస్యలపై ప్రభుత్వం ఒక...

శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించతలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్వాసితులతో మాట్లాడే ప్రయత్నం చేసిన సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి మధు అక్రమ నిర్బంధం ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంలో పెరుగుతున్న అసహనానికి పరాకాష్ట. పోలాకికి పాతిక కిలోమీటర్ల ముందే ఆముదాలవలన రైల్వే స్టేషన్‌లోనే మధును పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్య. పైగా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చేసేందుకు ఆయన సెల్‌ ఫోన్‌ గుంజుకోవడం, మారు మూల ప్రాంతానికి తరలించడం ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నాయి. బుధవారం ఉదయం ఆరు గంటలకు మధును అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం ఏడు గంటల వరకు ఆయనను స్టేషన్‌లో నిర్బంధించారు. తన అరెస్టుకు కారణం అడిగితే పై అధికారుల...

శ్రీకాకుళం జిల్లా పోలాకి ధర్మల్ విద్యుత్ కేంద్ర ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని, ప్రజా ఉద్యమాలపై నిర్భంధాన్ని ఖండించాలని శ్రీకాకుళంలోని ఎన్జీఓ హోంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ధర్మల్ ప్లాంట్ల ఏర్పాటుతో ఉపాధి కలగకపోగా రైతులకు , వ్యవసాయ కూలీలకు వున్నా ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేసారు .. అభివృద్ధి పేరుతొ రైతుఅల్ నోట్లో మట్టి కొట్టాలని చుస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ,త్వరలో పోలకిలో పర్యటిస్తామని అన్నారు. 

ఉక్కఫ్యాక్టరీ తరలింపు నిర్ణయంపై సోమవారం కడప జిల్లాలో నిరసన వ్యక్తమైంది. సోమవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. విమానాశ్రయం గేటు ఎక్కిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి వల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీి 'శ్రామిక జన శంఖారావం' ప్రచార గీతాల సిడిని శుక్రవారం ఆవిష్కరించింది. యూనియన్‌ ఉపాధ్యక్షురాలు పి. రోజా, కోశాధికారి ఎవి నాగేశ్వరరావుతో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ ఈ సిడిని ఆవిష్కరించారు. అనంతరం గఫూర్‌ విలేకరులతో మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై 10 పాటలను రూపొందించి ఈ సిడిలో ఉంచామన్నారు. ప్రచార గీతాలతో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్‌ 2 సమ్మె ఆవశ్యకతను కార్మిక వర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సిఐటియు నిర్ణయించిందని, అందులో భాగంగానే ప్రజా నాట్యమండలి సహకారంతో ఈ పాటలను రూపొందించామని చెప్పారు.

ముంపు మండలాల సమస్యలపై ఈనెల 20వ తేదీన బంద్‌ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ముంపు మండలాల్లో స్థానిక సిపిఎం నేతలతో కలిసి ఆయన పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. కనీసం అధికారుల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వెంటనే ఆర్‌డిఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామాలకూ రెవెన్యూ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. ముంపునకు గురవుతున్న ఆరు మండలాల పరిధిలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌...

'పోలీసు కేసులకు భయపడితే ఎయిర్‌పోర్టుకు భూములు పోవడం ఖాయం. కేసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది.' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. గురువారం ఆయన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో ఒకటైన కౌలువాడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడారు. ప్రజాప్రతిఘటన ముందు అన్నీ బలాదూరేనని అన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు కావాలని ప్రభుత్వం తొలుత చెప్పిందని, ప్రజల తిరుగుబాటుతో వెనక్కి తగ్గి 5,551 ఎకరాలకు దిగివచ్చిందని తెలిపారు. చంద్రబాబు పేదల భూములతో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు....

ప్రజలకు వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన జివిఎంసి 47వ వార్డు పరిధి గుల్లలపాలెం జివిఎంసి ఆసుపత్రి వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్ని నర్సింగరావు మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్నారని, మల్కాపురం, శ్రీహరిపురం ప్రాంతాల్లో రెండు డిస్పెన్షరీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పేరుకే 30 పడకల ఆసుపత్రులైనప్పటికీ, కొన్ని వ్యాధులకే మందులుంటున్నాయని పేర్కొన్నారు. సుగర్‌ టెస్టులు చేయాలంటే ట్యూబులు లేవని, రక్తహీనతకు, కీళ్ళ నొప్పులు తదితర వ్యాధులకు మందులు ఉండడం లేదని తెలిపారు. 

Pages