తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో 21 మంది మహిళలతో సహా మొత్తం 49 మంది పేద రైతులపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఖండించారు. తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ భూమిని పేద రైతులు చాలా కాలంగా సాగు చేసుకొంటున్నారన్నారు. తప్పుడు రికార్డుతో ఒక భూస్వామి ఆ భూమిని ఈ నెల 20వ తేదీన సాగు చేసుకొనేందుకు వచ్చాడన్నారు. అతనిని పేద రైతులు అడ్డుకోగా, పోలీసులు లాఠీఛార్జితోపాటు, భూస్వామి అనుచరులు దాడి చేశారన్నారు. ఈ దాడిలో ఒక దళితుడి చేయి విరిగిందని, దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుపోగా, పేదలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారని మండిపడ్డారు. పోలీసులు భూస్వామికి కొమ్ము కాసి తప్పుడు...
District News
విలీన మండలాల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆద్వర్యంలో నేడు బంద్ కొనసాగుతోంది..కూనవరం, వీఆర్ పురం, చింతూరు, ఎటపాక, కుకునూరు, వేలేరుపాడులో సీపీఎం ఇచ్చిన పిలుపు అందరినీ కదిలించడంతో వివిధ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. ముఖ్యంగా విలీనం జరిగి ఏడాదిన్నర గడుస్తున్నా కనీస సమస్యలు కూడా పరిష్కారం కాక రగిలిపోతున్న జనాల ఆగ్రహం బంద్ రూపంలో వ్యక్తమవుతోంది.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు చింతూరులో బంద్ కార్యక్రమంలో పాల్గొని రాస్తారోకో నిర్వహించారు..
రాజధాని గ్రామాల్లో భూ సమీకరణకు ఒప్పుకోని రైతుల భూములను భూ సేకరణ చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవాలనే ఉత్తర్వులను ఉప సంహరించాలని అఖిలపక్ష రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ సేకరణకు నిరసనగా శుక్రవారం క్రిడా కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ నెల 20 నుంచి భూసేకరణ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనను సమావేశం ఖండించింది. బలవంతపు భూసేకరణ ప్రయత్నాలను మానుకోవాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. భూ సమీకరణకు తమ భూములు ఇవ్వబోమని 8 వేల ఎకరాల రైతులు...
సెప్టెంబరు 2న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సిపిఎం తన సంపూర్ణ మద్ధతు తెలియజేసింది. కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు సామాన్యులను వంచించి, కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. కార్మిక హక్కులు కాలరాస్తున్న కార్పొరేట్ల కోసమే పాలన సాగిస్తున్న పాలకులకు ఈ సమ్మె ద్వారా కార్మికవర్గ హెచ్చరికను తెలియజేయాలన్నారు. ఏవిధమైన కార్మికుడికైనా కనీస వేతనం రూ.15 వేలు తగ్గకుండా ఉండాలన్నారు. కార్మిక చట్టాలు, పకడ్బంధీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా...
కృష్ణా కరకట్ట దిగువ భాగంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను రెగ్యులరైజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి తాత్కాలిక నివాసం ఏర్పాటవుతుం డటమే ఇందుకు కారణం.రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించిన 29 గ్రా మాలకు సమీపంలో పలువురు రైతులు షెడ్లు, కోళ్ల ఫారాలు, నివాస గృహాలు నిర్మించుకున్నారు. వాటన్నిటినీ పూలింగు కింద ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. నిర్మా ణాలకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. పదేపదే మంత్రి నారాయణ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. క్రిడా కమిషనర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ నిర్మాణాలు, ఇళ్లనూ పూలింగు ప్రక్రియకు ఇచ్చేశారు. ఈ...
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కార్పొరేట్ వ్యాపారుల పక్షమో, కష్టజీవుల పక్షమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ రెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రమంతా పర్యటిస్తున్న బస్సుయాత్ర గురువారం రాత్రి ఒంగోలుకు చేరుకుంది. బస్సుయాత్రకు స్ధానిక దక్షిణ బైపాస్ వద్ద ఉన్న జిల్లా పరిషత్‌కార్యాలయం వద్ద వివిధ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి నెల్లూరు బస్టాండ్, కలెక్టరేట్, చర్చి సెంటర్, మిరియాలపాలెం సెంటర్, పాత కూరగాయల మార్కెట్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో సభ...
ఇద్దరు ఇంటర్ విద్యార్థునుల బలన్మరణానికి కారణమైన కడప జిల్లాలోని నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరులో పోలీసులు విద్యార్థులపై జులుం ప్రదర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో గురువారం గుంటూరులో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని దుర్భాషలాడారు. పిడిగుద్దులతో బీభత్సాన్ని సృష్టించారు. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒక విద్యార్థిని తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని అభ్యర్థించినా పోలీసులు పట్టించుకోలేదు. 29 మందిని అరెస్ట్ చేసి అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.
విశాఖలో బాక్సైట్ గనులను కొల్లగొట్టి రూ.లక్ష కోట్లు లూటీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సిపిఎం నాయకులు జితేన్ చౌదరి ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రస్ ఆల్‌ఖైమా, జిందాల్‌తో చేసుకున్న గత ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, గతంలో సిపిఎం చెప్పిన విషయాన్నే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నివేదికలో పేర్కొందన్నారు. విశాఖ జిల్లాలో బాక్సైట్ ఖనిజం మొత్తం 550 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటుందని, దీని విలువ సుమారు రూ.లక్ష కోట్లు ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం దీనికి రూ.11,400కోట్లుగా లెక్కకట్టి, తర్వాత ఒప్పందంలో రూ.2800 కోట్లకు...
రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు దేశంలోని సహజ వనరులను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేసే దుందుడుకుగా వ్యవహరిస్తునాయి . విశాఖ గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు , గిరిజన చట్టాలకు కనీసం గౌరవించకుండా ఏకపక్షంగా రాష్ట్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్నది .దీనిపై పార్లమెంట్ లో లేవనెత్తుతానని సిపియం పార్లమెంట్ సభ్యులు జితేంద్ర చౌదరి గారు తెలియజేసారు. బాక్సైట్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేస్తానని, ఈ ఒప్పందాలన్నీ అనైతకమని చెప్పి గిరిజనుల ఓట్లు తో గెలిచారు. ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తూ గిరజనులను...