District News
ఆ గ్రామాలు కాలుష్యానికి చిరునామాలు....! రోగాలకు నిలయాలు.....!! నీటి యుద్ధాలకు నిలువుటద్దాలు....!!! అవి ఎక్కడా అనుకుంటున్నారా! అత్యంత కాలుష్య నగరంగా రికార్డుల కెక్కిన విశాఖ సమీపంలోని సింహాద్రి ఎన్‌టిపిసి విద్యుత్ కర్మాగార చుట్టుప్రక్కల గ్రామాలు. వివిధ పరిశ్రమల విషవాయువుల వల్ల కాలుష్య కోరల్లో కూరుకుపోతున్న గ్రామాలు, వాటి వల్ల బలౌతున్న ప్రాణుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తీర ప్రాంతంలో సెజ్‌లు, పిసిపిఐఆర్‌లు, విద్యుత్ ప్లాంట్లతో ముంచెత్తనున్నట్లు ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల అక్కడ పరిస్థితులు ఏమిటి? అక్కడ ప్రజల జీవితాలు ఏవిధంగా ఛిద్రమయ్యాయి? వారిని ఏవిధంగా కాపాడాలనే కనీసం ఆలోచనలేని ఈ...
శ్రీకాకుళం జిల్లాలో పోలాకి పవర్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన సిపిఎం నాయకులపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధుని దౌర్జన్యంగా అరెస్ట్ చేసారు. పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటికే స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలు ఉద్యమాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని తెలుసుకుని, బాధితుల గోడు వినడానికి వెళ్లాలనుకున్ననాయకుల సమాచారం ముందుగానే తెలుసుకుని రైల్వే స్టేషన్ లో దిగగానే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కార్పొరేట్ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాసోహ మయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్సివర్గ సభ్యులు ఎంఎ గఫూర్ విమర్శించారు. నెల్లూరులో జరిగిన కార్మిక చట్టాల సవరణల సదస్సుల్లో ఆయన ప్రసంగించారు. కార్మికులకు సమ్మె చేసే హక్కును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవ రణ చేస్తోందన్నారు. ఒక పథకం ప్రకారం కార్మిక సంఘాల ను నిర్వీర్యం చేసేందుకు నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిజెపి మిత్రపక్షమైన టిడిపి కూడా కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. మార్చి 26న కార్మిక చట్టాలకు సవ రణ చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ బి ల్లును వైసిపి కూడా అడ్డుకోలేదని కార్మికులు గుర్తించాలన్నా రు. కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేస్తే ఉక్కుపాదంతో...
నెల్లూరు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీల సమస్యలపై సదస్సు జరిగింది. మైనార్టీలు అమీరులు కాదు గరీబులని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ముస్ల్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయన్నారు. వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం హయాంలో మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. ఘర్‌వాపసి పేరుతో మత మార్పిడి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన మైనార్టీలకు బడ్జెట్ కేటాయించాలన్నారు. సచార్‌కమిటీ, రంగనాధ్‌మిశ్రా సిఫార్సులు బుట్ట దాఖలు చేశారని విమర్శించారు. ఉర్దూ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనందున మైనార్టీల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం విషయంలో తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో రైతుల నుండి భయపెట్టి ఇప్పటి వరకు 33,500 ఎకరాల భూమి తీసుకున్న ప్రభుత్వం సింగపూర్, జపాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం ఊహాచిత్రాలు విడుదల చేసి రాజధాని నిర్మాణం ఆగమేఘాలమీద జరిగిపోతుందని అరచేతిలో వైకుంఠం చూపించారు. రెండు రోజుల నుండి పత్రికల్లో (ముఖ్యమంత్రి అనుకూల పత్రిక) ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటనల తీరు మారింది. టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్ తరహాలో నిర్మాణం చేపడతామని వార్తలు లీక్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం ఆ పార్టీకి చెందిన వెంకటపాలెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహారావు ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాజధాని...
గిరిజన హక్కుల రక్షణకు , బాక్సైటు తవ్వకాలను జరపనివ్వ బోమని .. అటవీ హక్కుల రక్షణకు .. ఆదివాసిలకు మెరుగైన సదుపాయాల కల్పనే .. కా. యెమ్. సూర్యనారాయణకు ఇచ్చే నిజ నివాళి.. సూర్య ప్రధమ వర్దంతి సభలో సి. ఐ. టి. యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కా. . సి హెచ్. నరసింగ రావు అన్నారు. సూర్య కార్మిక , కర్షక ఉద్యమ స్పూర్తి అని కా. లోకనాధం నివాళి అర్పించారు. లోకనాధం గారు మాటలాడుతూ కామ్రేడ్ సూర్యం ప్రజలను ఇష్టపడ్డాడు .. ఈ సమాజం ఇంతకన్నా బాగుపడాలనుకున్నాడు, సమతా సిద్దాంతాన్ని ఇష్టంగా నమ్మాడు. ఉద్యమాన్ని తన చిరునామా చేసుకున్నాడు.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉద్యమ పిడుగై గర్జించాడు. మైదాన మండలంలో పుట్టిన సూర్యం.. అల్లూరి స్పూర్తిని అందుకున్నాడు. గిరిజనుల పక్షాన...
సిపిఎం ఆధ్వర్యాన రాజమండ్రిలో "ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు" అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధ్యసాధ్యాల పై పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కై సిపిఎం కృషి చేస్తోందన్నారు.
ఓటుకునోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇంటికి, ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు.ఎన్టీఆర్ ట్రస్టు భవన్ అధికారిక డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ కేసులో ముఖ్యమైన నింధితులు ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడంతో ఇలా క్రింది స్థాయి వారి నుంచి సమాచారం సేకరించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.