బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడడమే కామ్రేడ్ సూర్యం కు ఘనమైన నివాళి .. సిహెచ్. నరసింగరావు, లోకనాధం

గిరిజన హక్కుల రక్షణకు , బాక్సైటు తవ్వకాలను జరపనివ్వ బోమని .. అటవీ హక్కుల రక్షణకు .. ఆదివాసిలకు మెరుగైన సదుపాయాల కల్పనే .. కా. యెమ్. సూర్యనారాయణకు ఇచ్చే నిజ నివాళి.. సూర్య ప్రధమ వర్దంతి సభలో సి. ఐ. టి. యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కా. . సి హెచ్. నరసింగ రావు అన్నారు. సూర్య కార్మిక , కర్షక ఉద్యమ స్పూర్తి అని కా. లోకనాధం నివాళి అర్పించారు.  లోకనాధం గారు మాటలాడుతూ  కామ్రేడ్ సూర్యం ప్రజలను ఇష్టపడ్డాడు .. ఈ సమాజం ఇంతకన్నా బాగుపడాలనుకున్నాడు, సమతా సిద్దాంతాన్ని ఇష్టంగా నమ్మాడు. ఉద్యమాన్ని తన చిరునామా చేసుకున్నాడు.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉద్యమ పిడుగై గర్జించాడు. మైదాన మండలంలో పుట్టిన సూర్యం.. అల్లూరి స్పూర్తిని అందుకున్నాడు. గిరిజనుల పక్షాన వీరుడై నిలిచాడు. ఈ అడవీ, చెట్టూ మన నేలా ... మన రేలా కలకాలం వుండాలీ.. అంటే పోరాడాలని రుజువుచేసిచుపాడు... సూర్యం ... విశాఖ జిల్లా ఏజెన్సీ లో బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక పోరాటంలో, చైనాక్లే ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఎర్ర జెండా తడాక చూపిన వీరుడు.... ఏజెన్సీ లో ఊరూరా ఎర్ర జెండా ఎగారవేయాలనే లక్ష్యంలో కీలక పాత్రను వహించిన సూర్యకు ... ఘనమైన నివాళి అందించడం మన కర్తవ్యం ....వర్ధంతి సభ కు ఆశా, అంగన్వాడి , పంచాయతి, హాస్టల్, అన్ని తరగతుల కార్మికులు పాల్గొన్నారు.