ప్రజల జీవన ప్రమణాలు మొరుగుపదటం, వారి కొనుగోలుశక్తి పెరగటం ద్వార మాత్రమే నిజమైన అభివృధి సాధ్యమవుతుంది అని లక్ష్మణ్ రావు అన్నారు. ఆగస్టు 1నుండి 14 వరుకు జరిగె రాజకీయ ప్రచారం సందర్భంగా స్థానిక సి.పి.యం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేసంలో మాట్లాడుతూ, 73,74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థలకు సంబంధించి ముఖ్యమేనవన్నారు. వాటి ప్రకారం రాష్ట్ర పైనాన్స్ ఫెడరేషన్ లు ఏర్పాటు చేయాలని, మున్సిపాల్టీలకు 18 హక్కులు కల్పించాలి. కాని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చెయటం లేదు, జె ఎన్ ఎన్ యు ఆర్ ఎం పథకానికి మరో రూపమే స్మార్ట్ సిటీలని, వాటి వల్ల ప్రజలపై పన్నుల భారం పెరుగుతాయి తప్ప సామాన్యులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. నగరంలో రూ. 430 కోట్లతో జరుగుతున్న సమగ్ర...
District News
నవ్యాంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై బిజెపి, టిడిపిలు చేస్తున్న విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. అధికారంలోకొచ్చి సంవత్సరం దాటినా హోదాపై స్పష్టం చేయకుండా ప్రజలను డోలాయమానంలో పడేసేందుకు రెండు పార్టీలు నాలుగు నాల్కలతో మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా సహా పునర్విభజన చట్టంలో పొందుపర్చిన, ఆ సందర్భంగా పార్లమెంటు చర్చలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని బిజెపి, టిడిపి సంయుక్తంగా ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కాయి. వాగ్దానాల అమలులో రెండు పార్టీలూ కప్పదాట్లకు దిగడం జనానికి వెన్నుపోటు పొడవడమే. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కానీ, కనీస పరిశీలన కానీ కేంద్రం చేయట్లేదని మంత్రి ఇందర్‌జిత్ సింగ్ లోక్‌సభలో...
రాజధాని ప్రాంతంలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకోబోమని సిపిఎం క్రిడా కన్వీనర్ సిహెచ్.బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్రిడా కార్యాలయాన్ని పేదలు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, ఏప్రిల్ నుండే పింఛన్లిస్తామని అక్కడక్కడా కొద్దిమందికే ఇచ్చి సరిపెట్టారని, ఉండవల్లిలో ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక్కడి రైతులు పూలింగ్‌కు భూములివ్వనందునే కక్షగట్టారా? అని ప్రశ్నించారు. పింఛన్ల పంపిణీపై నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య, రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు తక్షణమే పింఛను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన తహశీల్దార్ వనజాక్షి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖను పంపారు. ముసునూరు నుండి బదిలీపై వెళ్లిపోవాలని లేకుంటే కుటుంబం మొత్తాన్ని చంపుతామని లేఖలో హెచ్చరికలు చేశారు. దీనితో ముసునూరు పీఎస్ లో వనజాక్షి ఫిర్యాదు చేసింది. ముసూనూరు తహశీల్దార్ గా వనజాక్షి విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను చేస్తున్నారంటూ తనిఖీలకు వెళ్లిన వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇతర ఉద్యోగులు దీనిని తీవ్రంగా ఖండించారు. వనజాక్షికి న్యాయం చేయాలంటూ పోరాటం చేపట్టారు. చివరకు సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. వనజాక్షి,...
నెల్లూరు:సొంత జిల్లాలో మంత్రి నారాయణకు చుక్కెదురైంది. తెలుగు గంగ కాలువ నిర్మాణ పనుల పరిశీలకు వెళ్లిన నారాయణను నీటి బిందెలతో మహిళలు అడ్డుకున్నారు. పక్కనే స్వర్ణముఖి నది ఉన్నా తాగు నీటి సమస్య తీరలేదని నిరసన తెలిపారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చే వరకు అడ్డుతొలగేది లేదని స్పష్టం చేశారు. జిల్లా అధికారులతో నారాయణ ఫోన్‌లో మాట్లాలో హామీ ఇవ్వడంతో మహిళలు తమ నిరసనను విరమించారు.
ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రముఖ పరిశ్రమ రానుంది. విమానాలను తయారు చేస్తున్న ప్రముఖ సంస్థ ఎయిర్ బస్ అనంతపురంలో విమానాల తయారీ పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 49.18 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ, జీవో నం. 264ను జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని లేపాక్షి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ సమీపంలో స్థలం కేటాయించారు. ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున ఎయిర్ బస్ చెల్లించనుంది. కాగా, ఈ స్థలానికి ఆనుకొని ఉన్న మరో 150 ఎకరాల స్థలాన్ని కూడా ఎయిర్ బస్ కోరుతోందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వ అధీనంలోని భూమిని ఎయిర్ బస్ కు అప్పగించిన ఏపీ సర్కారు, మిగతా భూమిని సైతం అందించే దిశగా ఆలోచనలు చేస్తోంది.
ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి
రాయలసీమకు తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని అన్నారు. లోటు బడ్జెట్‌ను పూరిస్తామని చట్టంలో ఉందని గుర్తు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని చట్టంలో ఉందని, ఇచ్చిన హామీ మేరకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్ర విద్యా సంస్థలతోపాటు వృత్తి శిక్షణనిచ్చే...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.
అనంతపురం: హంద్రీ-నీవా నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఉరవకొండలో రైతు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ రాజధాని నిర్మాణంతో వ్యాపారాలూ చేస్తూ... చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలైన ఎస్పీవై రెడ్డి, పుల్లారెడ్డిలకు రూ.2.150 కోట్ల విద్యుత్ రాయితీలు కల్పించిన ప్రభుత్వం మున్సిపల్, మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడేందుకు ఇష్టపడటం లేదని విమర్శించారు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇస్తానన్న మోదీ ఆ వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేకపోయారని తెలిపారు
హైదరాబాద్:విశాఖ నగరంలోని జ్ఞానాపురంలోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 102 టన్నుల ఉల్లిగడ్డలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో ఉల్లిని కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.