నాగార్జున యూనివర్సిటి బిఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి మృ తికి కారకులైన దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘ నేతలు రోడ్డెక్కారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు స్పందించి బాధ్యులైన వారిని అరెస్టు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు,అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకొన్నాయి. ఎట్టకేలకు విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వర్సిటీకి సెలవులు ఇచ్చి, విద్యార్థులు లేనపుడు...
District News
గతంలో పట్టాలిచ్చిన అటవీ భూములను చంద్రబాబు తిరిగి లాక్కోవాలని చూస్తున్నారని,మా ప్రాణాలు పోయినా సరే అడ్డుకొని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు.
విదేశీ పెట్టుబడిదారులతో దేశం అధోగతిపడుతోందని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి సింగపూర్, జపాన్‌ల వంటి వలస పాలన అవసరం లేదని ధ్వజమెత్తారు. సొంత వనరులపై ఆధారపడి ప్రభుత్వాలు పాలన సాగించాలని ఆయన సూచించారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ˜ీ, మద్య నియంత్రణ అంశాలపై శుక్రవారం ఇక్కడ మహిళా సంఘాల రాష్ట్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి. జయలక్ష్మి అధ్యక్షత వహించారు. సదస్సులో మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించినట్లుగా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ న్యాయ సమ్మతమేనన్నారు. మహిళల ఉద్దరణ కోసమే పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారనే సంగతి పాలకులు మరచిపోకూడదని హితవు పలికారు. మహిళలపై...
పేదల పొట్టగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. గురువారం కృష్ణాజిల్లా నాగాయలంకలో జరిగిన కోడూరు, నాగాయలంక మండలాల మత్స్యకారుల సదస్సులో ఆయన మాట్లాడారు. దశాబ్దాల తరబడి పేదలు సాగుచేసుకుంటున్న భూములను విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి నిమగమయ్యారని విమర్శించారు. లక్షలాది ఎకరాల భూమిని పేదల నుండి బలవంతంగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దివిసీమలోని 15 వేల మత్స్యకార కుటుంబాలకు చెందిన దాదాపు 20 వేల ఎకరాల భూమిని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓవైపు పేదల భూములను లాక్కుంటూ మరోవైపు సముద్ర తీరాల్లో విదేశీ సంస్థలతో ఫ్యాక్టరీలు...
హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని కార్మికులు, ఉద్యోగులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో అరబిందో పరిశ్రమ వద్ద బుధవారం నిర్వహిచిన 'కార్మిక గర్జన' సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్ట సవరణలను, కార్మిక ఉద్యమాలపై నిరంకుశ దాడులను, సామాజిక సంక్షేమ పథకాల నిధుల్లో కోతను విరమించాలని డిమాండ్ చేశారు. ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కారంలో చర్చల పేరుతో అరబిందో ఫార్మా, నాగార్జున అగ్రికమ్, ఆంధ్రా ఆర్గానిక్స్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, శ్యాంపిస్టన్ 2, 3, వరం పవర్ ప్లాంట్, ఫ్రింజ్ లేబోరేటరీస్, స్మార్ట్‌కమ్ యాజమాన్యాలు నెలల తరబడి...
వ్యవసాయ భూములు లాక్కుని కార్పొరేట్, విదేశీ కంపెనీలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లి, కొలనుకుదురు గ్రామాల్లో బుధవారం ఆయన పాదయాత్ర చేశారు. కట్టువపల్లిలోని సర్వే నెంబర్ 110 నుండి 900 వరకున్న 936 ఎకరాల భూములను చైనా కంపెనీ డలయన్ వాండాకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ కంపెనీ ప్రతినిధి మ్యాక్సూఅబౌట్ ఇటీవల ఆ భూములను పరిశీలించి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాగిన పాదయాత్రలో పలువురు రైతులతో మధు నేరుగా మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ 10...
రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గ్యాంబ్లింగ్ గేమ్‌ను తలపిస్తోంది. ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ ఇద్దరు కీలక అధికారులను మార్చేసింది. ఒకరికి రాజధాని ఎంఓయుపై అవగాహన ఉంటే, మరొకరికి ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియపై అవగాహనుంది. వీరిలో ఒకరు దొండపాటి సాంబశివరావు కాగా, మరొకరు ఆర్మానే గిరిధర్. రాజధానిపై జరిగిన ఒప్పందాలు, జరుగుతున్న తీరుపై వీరికి పూర్తి అవగాహన ఉంది. వీరిద్దరినీ తొలగించడం ద్వారా రాజధాని నిర్మాణ ప్రక్రియపై ముఖ్య మంత్రికి, క్రిడా కమిషనర్‌కు తప్ప మరెవరికీ పూర్తిస్థాయి అవగాహన లేని పరిస్థితి ఏర్ప డింది.
72వార్డుల్లో పాదయాత్రలు, సభలు, గ్రూపుమీటింగ్‌లు
ఆగష్టు 12, 14 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు
లక్షలాది కరపత్రాలు, బుక్‌లెట్స్‌తో ప్రచారం.
విశాఖనగరం స్మార్ట్‌సిటీగా ప్రకటించారు. సామాన్య మద్యతరగతి, పేద ప్రజల సమస్యలు పట్టించుకొనే నాధుడే లేడు. ఫలితంగా నగర ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక ప్రపంచబ్యాంకు సంస్కరణలు కూడా శరవేగంగా నగరంలో అమలు చేస్తున్నారు. పౌరసేవలను ప్రైవేటీకరిస్తున్నారు. కొండలు, భూములు, సముద్రతీరం, ఇతర వనరులను విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌సంస్థలకు ధారాధత్తం చేస్తున్నారు. జివిఎంసికి ఎన్నికలు పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో...
గూడూరులో జరిగిన కామ్రేడ్ ఇందుకూరు జనార్ధన్ రెడ్డి ప్రధమ వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మీటింగ్ హాలుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ,స్థానిక సిపిఎం నాయకులు,పార్టీ అభిమానులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ బుధవారం ఉదయం విచారణ ప్రారంభించింది. నెల్లూరు విక్రమసింహ వర్సిటీ వైస్ ఛాన్సలర్ వీరయ్య, వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలకృష్ణమనాయుడు, పద్మావతి వర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.