District News

తమ డిమాండ్లు నెరవేర్చాలని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె మంగళవారానికి 11 రోజులు పూర్తిచేసుకుంది. ఓపక్క పోరాటం ఉధృతంగా మారుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోగా విజయవాడలో పారిశుధ్య కార్మికులు మంగళవారం చేపట్టిన రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్‌ అధికారుల బంగ్లాల ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకుని అరెస్టులకు తెగబడింది. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి 200 మందికి పైగా అరెస్ట్‌ చేశారు. మహిళలనీ చూడక ఈడ్చికెళ్లి వ్యానులో పడేశారు. అరెస్టయి వన్‌టౌన్‌ పోలీసుస్టేషనులో ఉన్న ఆందోళనకారులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలతో పాటు పలు ట్రేడ్‌ యూనియన్ల రాష్ట్ర నేతలు కలిసి సంఘీభావం...

ఏపీ మంత్రిమండలి సమావేశం రాజమండ్రిలో బుధవారం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తొలి మంత్రివర్గ సమావేశం విశాఖలో జరిగింది. ఇప్పుడు రాజమండ్రి వేదికగా మారింది.  మంగళవారం రాత్రికే మంత్రులు, సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో సహా సీనియర్‌ ఐఎఎ్‌సలంతా రాజమండ్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పది గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించి.. ఆమోదించనున్నారు. మరికొన్ని కీలకాంశాలపైనా చర్చిస్తారని సమాచారం. ఈ భేటీలో రాజమండ్రి అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా టూరిజం అభివృద్ధిపై దృష్టిసారించాలని...

ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో అడుగుపెట్టాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ నేతలకు ఇక్కడి ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత కుమారుడు రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని నిలదీశారు. మరో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ సోనియా, రాహుల్‌ ప్రజలకు తీవ్ర నష్టం చేశారని, ఏకపక్షంగా మాటలు విని రాష్ట్రాన్ని విభజించారని తీవ్రంగా విమర్శించారు.

సి పి యం కేంద్రకమిటీ పిలుపులొ మేరకు జిల్లాలో వివిధ అంశాలపై ప్రత్యామ్నాయా విధానలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బి జె పి రాష్ట్రంలో టి డి పి పార్టీలు ఆధీకారంలొకి రావడనికి అవినీతిలేని స్వచ్చమైన పరిపాలన అందిస్తామని, దేశన్ని అభివృద్ది పధంలో నడిపిస్తామని వాగ్ధానం చేశారు. కాని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవినీతి కుంభకోణాలలో మునిగిపొయారు. లలీతమొడికి వీసాకి సాహయం చేయటంలొ,వ్యాపం కుంభకోణంలో బి జె పి పాత్ర ఉంది. రాష్ట్రంలో ఇసుక, వొటుకు-నొటు వంటి పలు అవినీతి కర్యాక్రమాలలో తి డి పి కురుకుపొయింది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వాల విధానలపై ఉద్యమిస్తూ, సమగ్రభివుద్ధి, విద్యారంగసమస్యలు, సామాజికసమస్యలు, కార్మికులు, రైతులు పట్టనణ ప్రాంత సమస్యలపై 1నుండి...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పాలనను నిరసిస్తూ, అవినీతి వ్యతిరేక దినంలో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సోమవారం వివిధ రూపాల్లో ఆందోళనలు, సదస్సులు జరిగాయి. విశాఖలో జరిగిన సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మాట్లాడుతూ అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాలించే నైతిక హక్కు ఇంకెంతమాత్రమూ లేదని , పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలేసే సమయంలో నిజాయితీగలవారైతే రాజీనామాలు చేయాలని, లేదంటే ప్రభుత్వమే వారిపై చర్య తీసుకోవాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. 

మున్సిపల్‌ ఉద్యోగు లు, కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. మున్సిపల్‌ జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్య క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉద్యోగుల్లో అధిక శాతం దళితులే ఉన్నారన్నారు. వారికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కూడా అటకెక్కించిన ఘనత చంద్ర బాబు ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. గతే డాది ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిగి న సందర్భంలో మున్సిపల్‌ కార్మికులకు కూడా వేతనాలు పెంచుతామని చంద్రబాబు వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్‌ ఉద్యోగుల ఆందోళనను అణచివేయడానికి...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా సాగుతోంది. ఆందోళనలో భాగంగా విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం ఎదుట కార్మికులు, ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. ఈ సమ్మెకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు. ప్రైవేటీకరణ పేరుతో మున్సిపాలిటీలను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు.

విశాఖ కెజిహెచ్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్నివ్యతిరేకిస్తూ సిపియం పార్టీ ఆద్వర్యంలో  సంతాల సేకరణలో పాల్గొన్న బి.వి.రాఘవులు ... 

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు ఆరోగ్యం నుండి కాపాడేది కేజిహెచ్‌. అటువంటి కేజిహెచ్‌లో కార్డియాలజీ విభాగాన్ని ప్రభుత్వం కేర్‌ కార్పొరేట్‌ సంస్థకు అప్పగించాలని నిర్ణయించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే కార్డియాలజీ విభాగానికి అవసరమైన వైద్య సిబ్బందిని నియమించి ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని విజ్ఞప్తి చేస్తోంది.
    ప్రస్తుతం గుండెజబ్బుకు వైద్యం అత్యంత ఖర్చుతో కూడుకున్నది. పేదలు ప్రైవేట్‌ వైద్యం చేయించుకోలేక కేజిహెచ్‌లోనే వైద్యం చేయించుకుంటున్నారు. రోజుకు రెండువేల...

ఈ రోజు విశాఖ లో జరిగిన అవినీతి వ్యతిరేక సభలో బి.వి. రాఘవులు గారు మాట్లాడుతూ ... ఏడాది కాలంలోనే తాము అవినీతి పార్టీలేనని బిజెపి, టిడిపి  రుజువు చేశాయన్నారు. అవినీతి, అక్రమాలకు ఆలవాలమైన కాంగ్రెస్ కు భిన్నంగా నీతిమంతమైన పాలన అందిస్తామని ప్రచారం చేసారు. అధికారం చేపట్టిన నాటి నుండి బిజెపి, టిడిపి కాంగ్రెస్ దారిలోనే నడుస్తున్నాయి . దేశ, విదేశ భాహుళజాతి కంపెనీలు వేలకోట్లు ఖర్చుపెట్టి  బిజెపిని గెలుపించుకున్నయన్నారు.  గెలిచినా తరువాత వారి రుణం తీర్చుకుంటున్నాడు  మోడీ . అందువలనే  దొంగల ముటాకు సహకరించడం, తద్వారా  తాము  వాటాలు పంచుకుంటున్నారు. మతోన్మాదంలో తప్ప ఎందులోనూ తాము కాంగ్రెస్ కు భిన్నం కాదని బిజెపి, టిడిపి రుజువు చేసుకున్నాయి. బిజెపి, టిడిపి...

Pages