District News

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 24న పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓడిసి నుండి కొండకమర్ల వరకు ఐదు గ్రామాల్లో పది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని ఏపిపిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. రఘువీరారెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు సి.రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్‌రావు, జెడి శీలం ఈరోజు ఉదయం రాహుల్ గాంధీతో సమావేశమై ఆయన అనంతపురం జిల్లా పర్యటన గురించి చర్చించారు. రాహుల్ గాంధీ అదేరోజు డబురవాలి పల్లిలో మహిళా డ్వాక్రా సంఘాలతో సమావేశమై మహిళల సమస్యలపై చర్చిస్తారన్నారు. రాహుల్ గాంధీ ఆ తరువాత కొండకమర్ల గ్రామంలో వలసవెళ్లగా మిగిలిన వృద్ధులు, కూలీలతో సంభాషిస్తారన్నారు. ఆయన...

రాష్ట్ర ప్రభుత్వ తరుపున ఈనెల 17న విజయవాడలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. అదేరోజు జరిగే 66వ వనమహోత్సవంలోనూ పాల్గొననున్నారు. బృందావన్‌కాలనీలోని ఎకన్వెన్షన్‌ హాల్లో సాయంత్రం ఐదుగంటల తరువాత ఇఫ్తార్‌ విందు ప్రభుత్వం తరుపున ఇవ్వనున్నారు. సుమారు మూడువేలమంది మంది హాజరవనున్నారు. అలాగే కొత్తూరు తాడేపల్లి అటవీ ప్రాంతంలోని జక్కంపూడి గ్రామ పరిధిలో వనమహోత్సవం జరగనుంది. దీనికి సంబంధించి ఫైలాన్‌ ఆవిష్కరించ డంతోపాటు, ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ముఖ్య మంత్రితోపాటు సుమారు 1000 మంది విద్యార్థులు మొక్కలు నాటే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతోపాటు కృష్ణాజిల్లాలో క్రిడా పరిధిలో ఉన్న 29 మండలాల్లో...

ఆసియా వాణిజ్య కేంద్రంగా అమరావతి మారనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. జపాన్‌లో వ్యాపారవేత్తల బృందం, ప్రభుత్వ ప్రతినిధులూ వాణిజ్య కేంద్రాల రాజధానిగా అమరావతి రూపుదిద్దుకునే అవకాశ ముందని చెప్పినట్లు తెలిసింది. తమ రాజధాని కంటే అధునాతనమైన, ఉత్తమమైన రాజధానిని ఏర్పాటు చేసేందుకూ అవకాశాలున్నాయని జపాన్‌ ప్రతినిధులు తెలిపారని క్రిడా కమిషనర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ చెబుతున్నారు. మాస్టర్‌ ప్లానొచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలుపెట్టేందుకు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు జపాన్‌ సంస్థలు ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులపై ఇప్పటికే బహుళజాతి కంపెనీలు దృష్టి సారించిన విషయం తెలిసిందే. సుదీర్ఘమైన కోస్తాతీరం...

 'మాకొద్దీ తెల్లదొరతనం/ దేవా, మా ప్రాణాలను త్రుంచి/మా మానాలను హరియించే/మాకొద్దీ తెల్ల దొరతనం' అన్న ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ పుట్టిన గడ్డ మీదే జపాన్‌ కంపెనీ సుమిటోమి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. సిక్కోలు భూమి, ఆస్ట్రేలియా బొగ్గు, జపాన్‌ వారి శాస్త్ర సాంకేతికతతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలను అభివృద్ధి చేస్తుందట! ఇప్పటికే సోంపేట, కాకరాపల్లిలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో గత ప్రభుత్వం ముగ్గురేసి చొప్పున ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. అయినా, పాలకులు వెనక్కి తగ్గడం లేదు. ఆరు థర్మల్‌ ప్రాజెక్టులను శ్రీకాకుళం జిల్లాలో పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటికి తోడు 'అణు...

పట్టణ సమస్యలపై రాష్ట్రంలోని మున్సిపల్‌ పట్టణాల్లో ఆందోళనలు నిర్వహిం చాలని సిపిఎం రాష్ట్రకమిటీ నిర్ణయించింది. సిపిఎం పట్టణ బాధ్యుల రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఆగస్టు 1 నుంచి 14 వరకు పట్ట ణ సమస్యలపై క్యాంపెయిన్‌లు, ఆందోళనలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణ యించింది. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి పి మధు హాజరయ్యారు. పట్టణ సమస్యలపై పోరాడాల్సిన అవశ్యకతను ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న మెగాసిటీలు, స్మార్ట్‌సిటీలు, అమృత్‌ పట్టణాలు అన్నీ కూడా పట్టణాల్లో మౌలిక సదుపాయాలను ప్రైవేటీకరింటి వ్యాపారమయం చేయ డం కోసం ఉద్దేశించినవేనని చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణ వల్ల పట్టణ ప్రజలు, తీవ్ర...

విజయవాడ రాజీవ్‌నగర్‌ కరకట్ట ప్రాంతంలోని పేదల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమాన్ని బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఓ వృద్ధురాలు వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానిక కార్పొరేటర్‌ పైడి తులసి తమను నట్టేట ముంచారని బాధితులు కంటతడిపెట్టారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు పునరావాసం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు సిపిఎం నాయకులు మద్దతుగా నిలబడ్డారు. పేదల పక్షాన నిలబడి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీశారు. దీంతో 200 మందికిపైగా ఉన్న పోలీసు బలగాలు మొహరించి అడ్డువచ్చిన సిపిఎం నేతలను, స్థానిక మహిళలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. సిపిఎం నగర కమిటీ సభ్యులు పి.సాంబిరెడ్డి, బి రమణరావు,...

పెట్టుబడిదారుల దోపిడీ వల్లే కొన్ని ప్రాంతాలు వెనుకబడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. వారి దోపిడీని అరికట్టి అభివృద్ధికి పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తిరుపతి సుందరయ్య నగర్‌లోని ఎంబి భవన్‌లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. సామ్రాజ్య వ్యవస్థను, భూస్వామి వ్యవస్థను వ్యతిరేకించే వారిని కలుపుకుని ఉద్యమించాలన్నారు. గ్రామీణ వ్యవస్థలో నెలకు ఐదువేల రూపాయలకు మించి ఆదాయం రాని వారు 50 శాతానికి పైగా ఉన్నారన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు ప్రత్యామ్నాయం వైపు అడుగులేస్తున్నారని, కలిసొచ్చేవారిని కూడగట్టుకుని...

విశాఖ మున్సిపల్‌ కార్మికుల సమ్మెతో స్మార్ట్‌ విశాఖ కాస్తా చెత్త విశాఖ‌గా మారిపోయింది. గత ఆరు రోజులుగా మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతున్న త‌రుణంలో నగరమంతా కంపుమయం అయ్యింది. 72 వార్డుల్లో దుర్గంధమయం అయ్యాయి. రోజుకు 800 టన్నుల చెత్త విశాఖలో పేరుకుపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో జనం పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు వ‌ర్షం ప‌డ‌తే రోడ్డు‌లు అస్త‌వ్య‌స్తంగా త‌యారవుతున్నా‌యి. దాని వ‌ల‌న అంటువ్యా‌ధులు ప్ర‌భ‌లే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తు‌న్నా‌రు.

మంగళవారం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటుచేసుకున్న మహా విషాదం ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. దీనిని వర్ణించడానికి మాటలు చాలవు. సర్కారీ నిర్లక్ష్యానికి రెండు డజన్లకు పైగా నిండు ప్రాణాలు గోదారిలో కలిసిపోయాయి. మృతులలో ఎక్కువ మంది మహిళలే. మరో 30 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సర్కార్‌ అనుసరించిన దారుణ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే ఈ తొక్కిసలాట. ప్రతి పన్నెండేళ్లకొకసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో కనీవిని ఎరుగని ఘోరమిది. చంద్రబాబు ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే ఈ మహా విషాదం నివారించబడేది. క్షతగాత్రుల హాహాకారాలు, మృతుల కుటుంబాల...

రాజమండ్రి దుర్ఘటనను ప్రభుత్వ వైఫ్యలంగా చూపి రాజకీయ కోణంలో విమర్శలు చేయడం తగదని హిందు ధర్మ ప్రచారకులు కమలానందభారతి అన్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం సముచితం కాదని,ప్రతిపక్షాన్ని, ఇతర ప్రజాసంఘానులను ఉద్ధేషించి ఆయన అన్నారు. పుష్కరాల్లో మృతి చెందిన వారు పుణ్యలోకాలకు వెళ్లినట్టుగా భావించాలన్నారు. తెలంగాణలో పుష్కరాలకు నీరు తక్కువగా ఉందని, అందుకోసం మహారాష్ట్ర నుంచి నీటి విడుదలకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని కమలానంద భారతి సూచించారు.

Pages