విజయవాడ ఇఫ్తార్‌ విందుకు సిఎం

రాష్ట్ర ప్రభుత్వ తరుపున ఈనెల 17న విజయవాడలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. అదేరోజు జరిగే 66వ వనమహోత్సవంలోనూ పాల్గొననున్నారు. బృందావన్‌కాలనీలోని ఎకన్వెన్షన్‌ హాల్లో సాయంత్రం ఐదుగంటల తరువాత ఇఫ్తార్‌ విందు ప్రభుత్వం తరుపున ఇవ్వనున్నారు. సుమారు మూడువేలమంది మంది హాజరవనున్నారు. అలాగే కొత్తూరు తాడేపల్లి అటవీ ప్రాంతంలోని జక్కంపూడి గ్రామ పరిధిలో వనమహోత్సవం జరగనుంది. దీనికి సంబంధించి ఫైలాన్‌ ఆవిష్కరించ డంతోపాటు, ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ముఖ్య మంత్రితోపాటు సుమారు 1000 మంది విద్యార్థులు మొక్కలు నాటే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతోపాటు కృష్ణాజిల్లాలో క్రిడా పరిధిలో ఉన్న 29 మండలాల్లో 1200 పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులతో 1.50 లక్షల మొక్కలు నాటించనున్నారు.