District News

ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న వారి సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. విజయవాడ కానూరు పప్పుల మిల్లు సెంటర్‌ శ్రీనివాసా కళ్యాణమండపంలో సిపిఎం కృష్ణాజిల్లా కమిటీ విస్తృత సమావేశం గురువారం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ, రాజధాని ప్రాంత భూముల్లో పంటలు లేకపోవడంతో ఉపాధిపోయి వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి అసైన్డ్‌ భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం చెక్కులివ్వకపోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. క్రిడా పరిధిలో జోన్ల ఏర్పాటుతో కొన్ని...

భారతదేశం గుర్తించిన రెండవ అధికార భాష అయిన ఉర్దూను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఇంగ్లీషు తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష ఉర్దూ. కావున ఉర్దూనే మరింత అభివృద్ధి చేయాలి. అయితే ఉర్దూ భాష ఎక్కువగా ముస్లింలకే అనే ముద్రపడింది. కానీ ఉర్దూ అంతర్జాతీయ భాష. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం జపనీస్‌ భాషను కోర్సుగా పెట్టి నేర్పించాలని ప్రయత్నిస్తున్నది. కానీ ఇప్పటికే వాడుకలో ఉన్న ఉర్దూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. గతంలో ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉండేది. కానీ నేడు ముస్లిం సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఉర్దూ పాఠశాలలు అధికంగా ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు...

కృష్ణా: ముసునూరు తహశీల్దార్ పై దాడికి నిరసనగా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వమిచ్చిన వాగ్దానం మేరకు డ్వాక్రా సంఘాలన్నింటికీ లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఆధార్‌తో సంబంధం లేకుండా దీన్ని వర్తింపజేయాలని పది వామపక్ష పార్టీల రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. డ్వాక్రా మహిళల సమస్యలపై గురువారం వామపక్షాల ఆధ్వర్యాన గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వమే పొదుపు చెల్లిస్తుందనే పేరుతో వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీ మీద వడ్డీ పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బకాయిలున్నాయనే...

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోడితాడిపర్రులో దశాబ్దాల తరబడి సాగుచేసుకుంటున్న తమ భూములను బలవంతంగా వేలం వేయాలని దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆరుగురు రైతుల్లో మరొకరు బుధవారం ఉదయం మృతి చెందారు.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న వీర్లపాటి చెత్తయ్య(70) బుధవారం ఉదయం మృతిచెందాడు. దీంతో బాధితులు మరింత ఆగ్రహంతో ప్రభుత్వాస్పత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో గుంటూరు-అమరావతి రోడ్డులో ప్రభుత్వాస్పత్రి మార్చురి వద్ద రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ,...

 నవ్యాంధ్ర రాజధాని చెంతనే ఉన్న ఆంధ్రుల వాణిజ్య రాజధాని విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి న మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సాక్షాత్తు రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రే ’విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెకు’్టకు మోకాలడ్డుతున్నట్లు సమాచారం. రోజురోజుకూ విస్తరిస్తున్న విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధాని నగరం అమరావతి వరకు మెట్రో రైలు మా ర్గాన్ని నిర్మించాలని ఏపీ సర్కార్‌ భావించింది. దానికి సంబంధించిన సవిరమైన నివేదికను రూపొందించే బాధ్యతను మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)కి గతేడాది అప్పగించింది. డీఎంఆర్‌సీ కొద్ది...

భారతదేశ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలతోనే సాధ్యమని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. సోమవారం రాత్రి ఉక్కునగరంలోని గురజాడ కళాక్షేత్రంలో స్టీల్‌ సిఐటియు ఆధ్వర్యాన 'సేవ్‌ ప్లబిక్‌సెక్టర్‌-సేవ్‌ ఇండియా' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తపన్‌సేన్‌ మాట్లాడుతూ.. భారత స్వాతంత్రోద్యమం ద్వారా బ్రిటీష్‌ పాలకులను వెళ్లగొట్టగలిగినా, వారి విధానాలను మాత్రం మన పాలకులు అనుసరిస్తున్నారన్నారు. మోడీ ప్రభుత్వం ఈ విధానాలను మరింత వేగంగా అమలుచేస్తోందన్నారు. కార్మిక చట్టాల మార్పు, పిఎఫ్‌ నిధులను షేర్‌ మార్కెట్‌కు తరలింపు, బీమా, రైలు, రక్షణ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడుల ఆహ్వానం, ప్రజా భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో...

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు రెండో తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటించారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ జిల్లా ప్లీనం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, సమ్మెను పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్త సమ్మెకు బిజెపి అనుబంధ సంస్థ అయిన బిఎంఎస్‌ కూడా మద్దతిస్తోందని చెప్పారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఆగస్టు ఒకటో తేదీ నుంచి 14వతేదీ వరకు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రధానంగా పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని అన్నారు. రైతు సమస్యలు,...

   దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల నుంచి రక్షించి ప్రభుత్వరంగాన్ని కాపా డటమే సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్‌యూనియన్లు తలపెట్టిన సమ్మె లక్ష్యమని సిఐటియు ఆలిండియా ప్రధానకార్యదర్శి తపన్‌సేన్‌ ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తపన్‌సేన్‌ మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ 'మేకిన్‌ ఇండియా' పేర దేశ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ వినాశనమే మోడీ, బిజెపి ధ్యేయమన్నారు. విమానయాన రంగం, గనులు, బ్యాంకులు, ఇన్సూరెన్సులు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలను ప్రయివేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టేం దుకు వ్యూహం రచించారని విమర్శించారు. పైపెచ్చు...

Pages