District News

ష్ట్రంలో రోజు రోజుకు అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు తారాస్థాయికి చేరుకుంటున్నా యి. కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దారు వనజాక్షిపై టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఆయన అనుయాయుల దాడి, చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగళ్లు మహిళా తాహశీల్దారు నారాయ ణమ్మను ఓ సర్పంచ్‌ దుర్భాషలాడిన సంఘటనలు మరువక ముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఒంటిమిట్టలో తాగునీళ్లు అందడం లేదని నిలదీసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రభుత్వ విప్‌, రాజంపేట ఎమ్మెల్యే సాక్షిగా టిడిపి మండల అధ్యక్షుడు దాడిచేశాడు. ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నా ఈ సంఘటనను చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సోమశిల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే...

 విభజన నేపథ్యంలో విశాఖను సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టినట్టు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఎంవిపిలో విశాఖ జూనియర్స్‌ పేరిట ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ భవిష్యత్‌లో విశాఖ అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందనుందన్నారు. విశాఖ జూనియర్స్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, వీటివల్ల బాలలలో ప్రతిభ పాటవాలను వెలికితీసేందుకు దోహదం చేస్తాయని తెలిపారు. పోటీలలో విజేతలుగా ఎవరు గెలిచినప్పటికి అందరు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే...

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. స్థానిక సెయింట్‌పాల్‌ చర్చి మైదానంలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ చేపట్టిన దీక్షను రెండో రోజే పోలీసులు భగ్నం చేయడం.. ఆ సమయంలో హర్షకుమార్‌ తన వద్దనున్న తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరపడం.. వంటి ఘటనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగరంలో సీఎం పర్యటన కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజమండ్రి నగరంలో ముస్లింలకు షాదిఖానా, క్రైస్తవులకు శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో హర్షకుమార్‌ శుక్రవారం దీక్ష ప్రారంభించారు. దీక్షకు పలువురు కాంగ్రెస్‌, వైసీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కానీ, శనివారం సాయంత్రం పోలీసులు దీక్ష జరుగుతున్న సెయింట్‌పాల్‌...

రాజధాని గ్రామాల్లో కౌలు రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాల్లో వ్యవసాయం ఉపసంహరణతో కౌలు రైతుల జీవనం అగమ్యగోచరంగా మారింది. రాజధాని ప్రాంతంలో మొత్తం 22 వేల మంది భూమి ఉన్న రైతులు ఉండగా వీరిలో 40 శాతం మంది రైతులు నేరుగా వ్యవసాయం చేయరు. వీరు ఎక్కువగా భూములను కౌలుకు ఇస్తారు. కొందరికి ఈ గ్రామాల్లో భూములు ఉన్నా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివశిస్తూ ఏడాదికి ఒకటి రెండు సార్లు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారు. అలాగే మరికొందరు రైతులు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో స్థిరపడి వారి భూములను కౌలుకు ఇస్తుంటారు. మొత్తం మీద 29 గ్రామాల పరిధిలో 4,230 మంది కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు గత కొన్నేళ్లుగా...

మున్సిపల్‌ కార్మికులతో మంత్రులు శనివారం రాత్రి పొద్దుపొయ్యేంతవరకు రాజమండ్రిలో జరిపిన చర్చలు విఫలమైనాయి. విధిలేని పరిస్థితుల్లో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జెఎసి ప్రకటించింది. పుష్కర విధులనూ బహిష్కరించాలని, పుష్కరాలు జరుపుతున్న ప్రాంతాల్లో పర్మినెంట్‌ ఉద్యోగులతో కలిసి సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించింది. మరోవైపు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జెఎసి ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవిధక సమ్మె శనివారానికి రెండో రోజుకు చేరుకుంది. పలు జిల్లాల్లో కార్మికులు ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించి నిరసన తెలిపారు. పిఆర్‌సి ప్రకారం రూ.15,432 కనీస వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు...

'అసలు నిన్నక్కడికి ఎవరెళ్లమన్నారు. నీవె వెళ్లినందువల్లే ఇంత రాద్దాంతం జరుగుతోంది. ప్రతి పక్షాలు అవకాశాన్ని తీసుకున్నాయి. అది పోలీసుల పని కదా... పోలీసులకు చెప్పి ఉంటే సరిపోయేది.' అని ముసునూరు తాహిసిల్ధార్‌ వనజాక్షినుద్ధేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి తన నివాసంలో ఎంఎల్‌ఏ దాడి వ్యవహారం సంఘ టనపై పంచాయతీ నిర్వహించారు. ఇరువర్గాలతో విడివిడిగా మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమా చారం ప్రకారం ఆయన బాధిత మహిళా అధికారి తీరుపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమె సంఘటన స్థలానికి వెళ్లకుండా ఉంటే బావుండేదని ఒకటికి రెండు సార్లు అన్న ఆయన ఇసుక తవ్వకాలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్లర్‌ పంపిన...

ఎపి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్య నెలకొల్పిన మద్యం షాపును వెంటనే తొలగించాలని కాకినాడలో మహిళలు ఆందోళనకు దిగారు. రామారావుపేట నైట్‌ హోటల్‌ సెంటర్‌లో ధర్నాకు దిగిన మహిళలకు సీపీఎం మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో మధు పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబుపై మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆడిన మాట తప్పారని..మోసగాడని ఘాటుగా విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే.. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన బాబు అధికారంలోకి వచ్చాక.. విస్తరింపచేసే కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు. మహిళల అందోళనకు రాజకీయ పక్షాలు పూర్తి మద్దతిస్తున్నాయని చెప్పారు. ఇదే విషయంలో సాయంత్రం అఖిలపక్షం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ట్యాపింగ్ తప్పు అని చెప్పిన చంద్రబాబు ఏ చట్టం ప్రకారం ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. బాబు సీఎంలా కాదు.. సెటిల్‌మెంట్ మినిస్టర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు యత్నిస్తున్నాడన్న వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. 

పదో పిఆర్‌సి ప్రకారం రూ. 15,432 కనీస వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు శుక్రవారంనుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. పలు జిల్లాల్లో విధుల బహిష్కరించి ర్యాలీలు, రాస్తా రోకోలు, ధర్నాలు తదితర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. వివిధ రూపాల్లో వెల్లువెత్తిన వీరి ఆందోళనకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు పలకడం విశేషం. వెంటనే సమస్యలను పరిష్క రించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్‌ తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. విజయవాడ నగర పాలక సంస్థ వద్ద మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వరకు మహాప్రదర్శన...

మోడీ, చంద్ర బాబు ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ దుయ్య బట్టారు. తిరుపతిలోని ఎంబి భవన్‌లో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల క్లస్టర్ల సమావేశంలో ఆయన ప్రసం గించారు. సెపెంబర్‌ 2న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వ త్రిక సమ్మె ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఎన్నో త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకొన్న చట్టాలను మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా సవరణకు పూనుకుందన్నారు. రాజస్థా న్‌లో బిజెపి ప్రభుత్వం కీలకమైన పారిశ్రామిక వివాదాల చట్టం, ఫ్యాక్టరీ చట్టం, కాంట్రాక్టు లేబర్‌ చట్టం, కనీస వేతనాల చట్టంను సవరించి కార్మికుల హక్కుల ను కాలరాసిందన్నారు...

Pages