District News

 ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అనేక అంశాలు పొందిపరిచారు. బ్రహ్మ స్థానంలో ఏమేమి ఉంటాయి, సచివాలయం ఎక్కడ నిర్మిస్తారు.. హైకోర్టు ఎక్కడ.. తదితర అంశాలు అందులో పొందిపరిచారు.
అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సోమవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నారు. నవ్యాంధ్ర రాజధాని రూపురేఖలన్నీ మాస్టర్‌ ప్లాన్‌లో పొందిపరిచారు. అంతకు ముందే ఈశ్వరన్‌ అమరవాతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను చంద్రబాబుకు అందజేశారు. ఇప్పుడు సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అందజేయనున్నారు. సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అత్యంత అధునాతనమైనటువంటి...

నాడు సాగించిన స్వాతంత్య్రోద్యమం తరహాలోనే మరో పోరాటం సాగాల్సిన అవసరముందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రమొచ్చి 65 ఏళ్లు దాటినా అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాల్సిన బాధ్యత వామపక్షాలపైనే ఉందని సూచించారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఆదివారం అనంతపురం నగరంలోని వికె.మెమోరియల్‌ హాలులో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుల కుటుంబ సభ్యుల సమ్మేళనం' జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ఇంతియాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్‌ కమ్యూనిస్టు నాయకులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 80...

 అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, ఏడాది కాలంగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేస్తామని చెబుతున్న మంత్రులు, వాటిని ముందు అమలు చేసి, తర్వాత జిల్లా ప్రతిపాదనలు తీసుకోస్తే బాగుంటుందని అంటున్నారు. మరోవైపు అమరావతి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అలోచన మంచిదైనప్పటకీ , ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలంటే అనేక శాఖలను అనుసంధానం చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం మంత్రుల కార్యాలయాల తరలింపు సాధ్యం కానప్పుడు , ఇప్పుడు ప్రత్యేక జిల్లా అవసరం ఉండబోదని విశ్లేషకులు అంటున్నారు.

రానున్న పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న భూ సేకరణ చట్టానికి సవరణ బిల్లుతో పాటు, ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సవరణ, సరుకులు, సేవల బిల్లు (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ -జిఎస్‌టి) బిల్లు వీటిలో కీలకమైనాయి. పన్నుల విధానంలో పెనుమార్పులు తీసుకువచ్చే జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేస్తోందని, రాష్ట్రాల ప్రభుత్వాలతో, ఆర్థిక శాఖ మంత్రులతో అనేక దఫాలు చర్చించి,కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ స్థూలంగా అంగీకరించారంటూ...

 ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆగస్టు 1 నుంచి 14వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ తెలిపారు. గుంటూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెవి రాఘవులు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు కులం, మతం, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. భవిష్యత్‌ రాజధాని ఎలా ఉండబోతుందో చూపిస్తున్న ప్రభుత్వం అందులో కార్మికులు, కూలీలు, రైతులు, ఇతర సామాన్యుల స్థానమేమిటో, వారి జీవనోపాధి ఎలా ఉండాలో ప్రస్తావించడం లేదన్నారు. రాజధాని ముసుగులో...

కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలుగు రాష్ర్టాల జుట్లు ముడేసింది. రాష్ర్టాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు పెద్దన్నయ్య పాత్ర పోషించాల్సిన కేంద్రం.... తెలుగు రాష్ర్టాల మధ్య సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తోంది. ‘ట్యాపింగ్‌’ వివాదాన్ని సర్దుబాటు చేయాల్సిందిపోయి... సర్వీస్‌ ప్రొవైడర్లను వెనుకేసుకొచ్చే క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్య మరింత పెరిగేలా లేఖలు రాసింది. ‘మేం ట్యాపింగ్‌ చేయలేదు!’ అని తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ అధికారులు వాదిస్తుండగా... ఒకరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారికంగానే సర్వీస్‌ ప్రొవైడర్లు ‘చర్య’లు తీసుకున్నారంటూ ఏపీ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది. ఈ విషయంలో సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అదే సమయంలో... ‘...

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే తోడు వచ్చే పార్టీలతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో ఏపీ ఎంపీలకు హిజ్రాలతో సన్మానం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంపీలు పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు. 

అక్రమ అరెస్టులు, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జెఎసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. 18న ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జెఎసి పిలుపునిచ్చింది. 18, 19తేదిల్లో ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిల మద్దతు కోరుతూ సామూహిక రాయబారాలు నిర్వహించాలని, 20న కుటుంబ సభ్యులతో భిక్షాటన, 21న జిల్లా కలెక్టరేట్ల పికెటింగ్‌, 22న రాస్తారోకోలు, 23న పట్టణాల్లో నిరసన ర్యాలీలు, 24న మంత్రుల ఇళ్లను హోరావ్‌ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మున్సిపల్‌, ఉద్యోగులు, కార్మికులకు జెఎసి విజ్ఞప్తి చేసింది.

మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో ఛలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి యత్నాన్ని పోలీసులు శుక్రవారం అడుగడుగునా అడ్డుకున్నారు. మహిళలను సైతం విచక్షణ రహితంగా లాగిపారేస్తూ పాశవికంగా వ్యవహరించారు. మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది మున్సిపల్‌ పారిశుద్య కార్మికులు, వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచిన వామపక్ష పార్టీలకు చెందిన నాయకులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీని పోలీసులు పాత బస్టాండ్‌ సెంటరులో అడ్డుకున్నారు. ఒకింత భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిచారు. కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్‌ జెఎసి నాయకులను అరెస్టులు చేశారు. మహిళా కార్మికులను, మహిళా నాయకులను...

Pages