టిడిపి మరో ఆగడం

ష్ట్రంలో రోజు రోజుకు అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు తారాస్థాయికి చేరుకుంటున్నా యి. కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దారు వనజాక్షిపై టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఆయన అనుయాయుల దాడి, చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగళ్లు మహిళా తాహశీల్దారు నారాయ ణమ్మను ఓ సర్పంచ్‌ దుర్భాషలాడిన సంఘటనలు మరువక ముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఒంటిమిట్టలో తాగునీళ్లు అందడం లేదని నిలదీసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రభుత్వ విప్‌, రాజంపేట ఎమ్మెల్యే సాక్షిగా టిడిపి మండల అధ్యక్షుడు దాడిచేశాడు. ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నా ఈ సంఘటనను చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సోమశిల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డికి ఒంటిమిట్టలో కాపురం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరమణ తాగునీరు సరిగా రావడం లేదని ఫిర్యాదు చేశారు. దీన్ని జీర్నించుకోలేని ఒంటిమిట్ట సర్పంచ్‌ సుజాత బావ, టిడిపి మండల అధ్యక్షులు కొమరా వెంకట నరసయ్య ఆగ్రహావేశానికి గురై చెంపఛెళ్ల్‌ మనిపించాడు. మీ సమక్షంలోనే తనను కొట్టారనీ, న్యాయం చేయాలని మేడాను ఉపాధ్యా యుడు కోరాడు. సర్దుబాటు చేసుకోవాలనీ, సమావేశం ఉంది తాను వెళుతున్నానని మేడా పట్టిచుకోకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వ ఉపాధ్యా యునిపై దాడి జరిగినా మేడా వెళ్లడం పట్ల మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యా యుడు వెంకటరమణ స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి వెంకటనరసయ్యపై ఫిర్యాదు చేశారు. తనకు నరసయ్య నుంచి ప్రాణహాణి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాపై దుర్భాషలాడి, చెంపఛెళ్ల్‌ మనిపించిన నరసయ్యపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుడు కోరారు. ఉపాధ్యా యుడు వెంకట రమణ మండలంలోని రాచపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇంగ్తీషు టీచర్‌గా పని చేస్తున్నారు. ఇదిలాఉండగా దాడికి 
పాల్పడిన వెంకట నరసయ్య ప్రతిగా ఫిర్యాదుదారుడు వెంకటరమణపై కౌంటర్‌ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిపై దాడికి పాల్పడిన టిడిపి మండల అధ్యక్షులు వెంకట సరసయ్య గతంలో సర్పంచ్‌గా కొనసాగాడు. ప్రస్తుతం అతని మరదలు సుజాత సర్పంచ్‌గా ఉన్నారు. అయినా మొత్తం తానై బినామీ సర్పంచ్‌గా వెంకట నరసయ్య వ్యవహరిస్తూ పంచాయతీకి సంబంధించిన రూ.20 లక్షలు దుర్వినియోగం చేసినట్లు అభియోగం ఉంది. దీనిపై అనేక ఫిర్యాదులు జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులకు వెళ్లాయి. ఆ ఫిర్యాదులపై రాష్ట్ర సిఐడి అధికారులు విచారణ చేసి కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట పోలీసుస్టేషన్‌లో సరసయ్య, అతని మరదలు, సర్పంచు సుజాతపై 420 కేసు నమోదైంది. యదేశ్ఛగా గ్రామంలో ఉంటున్నా పోలీసులు వారిని అరెస్టు చేయకపోవడం ఆశ్చర్యకరం. అరెస్టు చేయకుండా ఉండటానికి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదు. శనివారం ఉపాధ్యాయుడుపై దాడి జరిగినా ఇరు కేసులపై విచారణ జరిపి కేసులు కడతామని పోలీసులు పేర్కొన్నడం గమనార్హం.