ఆగస్టు1నుంచి14 వరకు పట్టణ సమస్యలపై ఆందోళనలు: సిపిఎం

పట్టణ సమస్యలపై రాష్ట్రంలోని మున్సిపల్‌ పట్టణాల్లో ఆందోళనలు నిర్వహిం చాలని సిపిఎం రాష్ట్రకమిటీ నిర్ణయించింది. సిపిఎం పట్టణ బాధ్యుల రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఆగస్టు 1 నుంచి 14 వరకు పట్ట ణ సమస్యలపై క్యాంపెయిన్‌లు, ఆందోళనలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణ యించింది. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి పి మధు హాజరయ్యారు. పట్టణ సమస్యలపై పోరాడాల్సిన అవశ్యకతను ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న మెగాసిటీలు, స్మార్ట్‌సిటీలు, అమృత్‌ పట్టణాలు అన్నీ కూడా పట్టణాల్లో మౌలిక సదుపాయాలను ప్రైవేటీకరింటి వ్యాపారమయం చేయ డం కోసం ఉద్దేశించినవేనని చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణ వల్ల పట్టణ ప్రజలు, తీవ్ర దోపిడీకి గురవుతారని, పట్టణాల్లో బ్రతుకు భారంగా మార టబోతున్నదని వెల్లడించారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ఈ విధానాలను ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సి హెచ్‌ బాబురావు మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో పట్టణ మౌలిక సదుపా యాలను ప్రైవేటీకరించడం కోసం రాష్ట్రప్రభుత్వం కొన్ని కార్పొరేషన్‌లను గ్రిడ్‌లను ఏర్పాటు చేస్తుందన్నారు. నూతనంగా నిర్మించే రాజధానిలో మౌలిక సదుపాయా లను ప్రైవేటీకరించడం కోసం రాజధాని అభివృద్ధి కార్పొరేషన్‌, పట్టణాల్లో పారిశుద్ధాన్ని ప్రైవేటికరించడం కోసం స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ను, పార్కులు, ఖాళీస్థలం, గ్రీన్‌బెల్టులను ప్రైవేటికరించడం కోసం ఎపి అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేస్తూ జివోలను విడుదల చేసిందన్నారు. 
ఈ కార్పొరేషన్‌లను కంపెనీ చట్టం 2013 ప్రకారం ఏర్పాటు చేశారని వీటిలో ప్రైవేట్‌ పెట్టుబడిదారులు షేర్లు కొనుక్కునే అవకాశాన్ని కల్పించారని తెలిపారు. పట్టణాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఇళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. ఈ సమస్యలన్నింటిపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఇందుకోసం క్యాంపెయిన్‌లు, ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పట్టణాల్లో, నగరాల్లో ప్రజలు పలు సమస్యలతో సతమతమౌతున్నారన్నారు. వీటికి వ్యతిరేకంగా విస్తృత ప్రాతిపదికను, విశాల ఉద్యమాన్ని నిరించేందుకు కృషి చేయాలని కోరారు. గౌస్‌దేశాయి అధ్యక్షత జరిగిన ఈ సమావేశం ఆగస్టు 1 నుంచి 14 వరకు జరిగే కార్యక్రమాలను రూపొందించింది. మున్సిపల్‌ పారిశుద్య కార్మికుల సమ్మెకు ఈ సమావేశం మద్దతు తెలిపింది. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింప చేయడానికి ప్రయత్నించాల్సిన ఎమ్మెల్యేలు, మేయర్లు, కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్మికులపై ఎదురుదాడికి దిగడాన్ని, పోటీ కార్మికులను తెచ్చి పనులు చేయించాలని చూడటాన్ని ఈ సమావేశం ఖండించింది.