District News

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి డి.గౌస్‌ దేశారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గౌస్‌దేశారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు బిజెపి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయాని కోరారు. బిజెపి, టిడిపి కుమ్మ క్కై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నిక లకు ముందు ప్రత్యేకహోదాపై గగ్గోలు పెట్టి ఇప్పుడు పలకడం లేదని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అన్ని రాజకీయ పార్టీలనూ ఏకం చేసి పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

భజరంగ్‌ జూట్‌మిల్లు అక్రమ లాకౌట్‌ వ్యవహారాన్ని తేలుస్తారో.. లేక తేల్చుకోమంటారో తేల్చి చెప్పాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. గఫూర్‌ ప్రభుత్వానికి సవాలు విసిరారు. అక్రమ లాకౌట్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం దీక్షలను ఆయన ప్రారంభించారు. గఫూర్‌ మాట్లాడుతూ భజరంగ్‌ జూట్‌మిల్లు ఆస్తులు ప్రస్తుత యజమానివి కావన్నారు. ఆ వాస్తవాన్ని గమనించి మిల్లు నడపడం చేతకాకపోతే ప్రభుత్వానికి అప్పగించిపోవాలే తప్ప అమ్ముకునేందుకు వారికి హక్కు లేదన్నారు. వారు ఈ విషయాన్ని గుర్తెరగని పక్షంలో 'ఇది కార్మిక ఆస్తి' అని ఇక్కడ బోర్డు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కుప్పంలో ఏకపక్షంగా జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగిస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. విమానాశ్రయం కోసం భూములు కోల్పోతున్న కుప్పం నియోజక వర్గంలోని కడపల్లి, పాడుచేన్లు, తిమ్మరాజుపల్లి, కనుమలదొడ్డి, బీర్నకుప్పం గ్రామాల్లో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములను ఆయన సందర్శించారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కడపల్లిలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు భూ బ్యాంకు పేరిట పది లక్షల ఎకరాలను ఏకపక్షంగా...

కులాలు, మతాలు, మతతత్వం వంటి అంశాలు ప్రాబల్యం చూపుతున్న నేటి పరిస్థితుల్లో సమాజాన్ని మేల్కొలిపేది సాహిత్యమేనని సాహిత్య ప్రస్థానం ఎడిటర్‌, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం స్థానిక రోటరీ క్లబ్‌ హాల్లో జరిగింది. ప్రముఖ కవి డాక్టర్‌ అదేపల్లి రామ్మోహనరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఎంఎల్‌సి రాము సూర్యా రావుతోపాటు తెలకపల్లి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రవి మాట్లా డుతూ సాహిత్యం నేటి యువత రాన్నీ, విద్యార్థులనూ ఆకట్టు కునేలా ఉండాలన్నారు. 
సమాజానికి ప్రతి ఒక్కరూ అక్షరంతోగానీ, బోధనతో గానీ సేవలందిం చాలన్నారు. కుల, మతతత్వాలు, నిరంకుశత్వాలను నేటి పాలకులు పెంచి...

ప్రజా సమస్యలపై సిపిఎం ప్రచారాందోళనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు పాఠశాలలనూ, పిహెచ్‌సిలనూ సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఆత్మహత్యలు పాల్పడిన రైతుల కుటుంబ సభ్యులు జంతర్‌ మంతర్‌ వద్ద ఆగస్ట్‌ ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు పార్లమెంటు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా చెప్పారు.గత రెండున్నర దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా రైతాంగం చెప్పనలవి కాని బాధలను అనుభవిస్తోందని, వ్యవసాయ రంగం కుదేలయిందని మొల్లా విమర్శించారు. రైతాంగం ఆత్మహత్యలకు ఈ విధానాలే కారణమన్నారు. అధికారిక అంచనాల మేరకు ఈ కాలంలో మూడున్నర లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు కనీసం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల రుణాల మాఫీ , కేరళ తరహాలో...

గుంటూరు, విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆధునాతన పరికరాలు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలను అభివృద్ధ్ది చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన శుక్రవారం ఒక లేఖ రాశారు. రెండు నగరాల మధ్య రాష్ట్ర రాజధాని నిర్ణయించడంతో ఈ రెండు ఆసుపత్రులకు ప్రాధాన్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈ ఆసుపత్రులకు రోజూ సుమారు 1500 మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారని మధు పేర్కొన్నారు. విజయవాడ ఆస్పత్రిలో ఇన్‌ పేషెంట్ల కోసం 670 పడకలు మంజూరైనా, 412 పడకలు మాత్రమే వినియోగంలో ఉన్నాయని తెలిపారు. రోగుల సంఖ్యను బట్టి మరో 80 పడకలు అవసరమవుతాయన్నారు. మొత్తం 750 పడకల రోగులకు వైద్య సేవలు సరిగా అందాలంటే అందుకు అవసరమైన...

ప్రజా సమస్యలపై సిపిఎం చేపట్టిన ప్రచారాందోళనల్లో భాగంగా బుధవారం తెనాలి జిల్లా వైద్యశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం బాధ్యత తీసుకుని రాజధాని వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. సూపరింటెండెంట్‌ ఈశ్వర ప్రసాద్‌తోనూ, రోగులతోనూ మాట్లాడి వైద్యసేవలపై వివరాలు సేకరించారు. 10 లక్షల మంది ఈ ఆస్పత్రిపై ఆధారపడ్డా అందుకనుగుణంగా సదుపాయాల్లేవన్నారు. డాక్టర్ల కొరతతోపాటు దోభీ, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఆస్పత్రికి ఆర్‌టిసి లోకల్‌ సర్వీసులు తిప్పాలని,కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలనూ పెంచాలని డిమాండ్‌ చేశారు. 

 

విశాఖ జిల్లా పాయకరావుపేటలోని ఎస్సీ హాస్టల్లో సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, నక్కపల్లి డివిజన్ కార్యదర్శి యం. అప్పలరాజు, దాసు రాత్రి బస చేసారు. విద్యా రంగ సమస్యలు పరిష్కారం కోసం సిపియం పార్టీ రాష్ట్రంలో ప్రచారోద్యం చేపట్టింది. అందులో బాగంగా  ప్రభుత్వ వసతి గృహంను పరిశీలించి అక్కడ విద్యార్దులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు .. అనంతరం బిసి వసతి గ్రుహంకు వెళ్లి శ్రమదానం చేసారు.... ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యా రంగంపై వున్నా మక్కువ ప్రభుత్వ విద్యా సంస్థలపై లేదు. ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పునుకుంటుంది. జిల్లలో 12 వసతి గృహాలను పలు కారణాలతో మూసివేసింది . తక్షణం వాటిని తెరవాలని కె.లోకనాధం...

Pages