District News

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని భూముల లావాదేవీల్లో నల్లధనం వరదలై పారుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆదాయ పన్ను శాఖ కళ్లుమూసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజధాని గ్రామాలలో గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు దాదాపు రూ.10వేల కోట్ల నల్లధనం లావాదేవీలు సాగినట్లు హైకోర్టు న్యాయవాది ఒకరు అంచనా వేశారు. వాటిని పరిశీలించాల్సిందిగా ఆయన డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ (ఇన్వెస్టిగేషన్‌) కు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదులోని వివరాల ప్రకారం... ఎపి ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 30న గుంటూరు జిల్లాలోని 29 గ్రామాలను క్యాపిటల్‌ సిటీ ఏరియాగా నోటిఫై చేయడానికి ముందునుంచే అక్కడ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 2014 సెప్టెంబరు, అక్టోబరు...

కేంద్రమంత్రివర్యులు వెంకయ్యనాయుడుగారు మరో మారు తన వాచాలతను ప్రదర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నిట్‌ శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక హోదా ప్రకటించాలని విద్యార్థులు నినదించినదే తడవుగా ఆయనకు ఆగ్రహం కట్టలు తెగింది. హోదా విషయమై ప్రతిపక్షం వారి విమర్శలను సైతం మనసులో పెట్టుకున్నట్టున్నారు. ఆవేశం, ఆక్రోశం కలగలిపిన స్వరంతో ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం స్వోత్కర్ష, పరనిందలతోనే సాగింది. వంటికి వేసుకొనే చొక్కా రంగు మొదలుకొని భుజాన మోసే పార్టీ జండా వరకు ఏకరువు పెట్టి రాజకీయాల్లో తానేవిధంగా స్వశక్తితో ఎది గారో గొప్పగా చెప్పుకున్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన సందర్భంగా ఆయన ఆంధ్ర పక్షాన నిలబడి గట్టిగా మాట్లాడబట్టే రాష్ట్రానికి కొంతయినా...

రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూమిని 99 సంవత్సరాలపాటు స్వదేశీ, విదేశీ కంపెనీలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే 110 జీవోను విడుదల చేసింది. రాజధాని నిర్మాణానికి, నిర్వహణకు, క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌(సిసిడిఎంసి)ను ఏర్పాటు చేసింది. ఇందులో తొలుత పది మందిని సభ్యులుగా పెట్టి అనంతరం మరొకరిని పెంచింది. అంటే పదకొండు మందిలో ఏడుగురు ప్రభుత్వాధికారులుంటే నలుగురు పారిశ్రామివేత్తలు డైరెక్టర్లుగా ఉన్నారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి సింగపూర్‌తోపాటు, జపాన్‌, తదితర దేశాలకు అప్పగించనున్నారు. డెవలప్‌మెంట్‌ పార్టనర్‌గా సింగపూర్‌ ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం రాజధాని...

డిగ్రీ కళాశాలలో సెమిస్టర్‌ విధానాన్ని విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈ విధానం వల్ల పేద విద్యార్థులకు కలిగే నష్టాలపై ముద్రించిన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేసింది.90 శాతం డిగ్రీ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఇలాంటి స్థితిలో ఆరు నెలల కాలంలో నాలుగు ఇంటర్నల్స్‌, నాలుగు ప్రాక్టికల్స్‌, రెండు సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. డిగ్రీలో ఉపాధి కోర్సులు ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులలను వెంటనే భర్తీ చేయాలని, సెమిస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. 

రాజధాని పరిధిలో భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను, రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి. మధు అన్నారు. అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భూసమీ కరణకు భూమి ఇవ్వకుండా ఉన్న రైతుల నుంచి భూమిని తీసుకోవడానికి రాష్ట్ర పభ్రుత్వం భూసే కరణ నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. దీనికి నిరస నగా ప్రకాశం బ్యారేజి వద్ద ఆదివారం రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారన్నారు. అరెస్టు చేసిన వారిలో సిపిఎం నాయకులు సిహెచ్‌. బాబూరావు, జె. శివ శంకర్‌, రవి, నవీన్‌ వైకాపా నాయకులు శ్రీని వాస్‌రె డ్డితో పాటు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. ఆగస్టు 17న హిందూ పురం నుంచి బయలుదేరిన బస్సు జాతా శనివారం రాత్రి రాజమండ్రికి చేరుకుంది. ఈ సందర్భంగా బొమ్మన రామచంద్రరావు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రస్ట్‌ హాల్లో జరిగిన సభలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ సమాఖ్య నాయకులు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. ఈ విధానాలను సమ్మె ద్వారా తిప్పికొట్టాలన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమా...

బలవంతపు భూ సేకరణ తగదు-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రాజధాని పరిధిలో బలవంతపు భూసేకరణ తగదని, ఈ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధానికి సరిపోయినన్ని భూములు ఇప్పటికే సమీకరించారని, కొత్తగా సేకరించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రైతుల భూములను పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం సేకరణకు వెళ్లిందని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ ఆర్డినెన్స్‌లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సేకరణ ప్రకటన చేయడం ఏ మాత్రమూ క్షమార్హం కాదని పేర్కొన్నారు. ఆర్డినెన్స్‌లు ఇంతవరకు ఆమోదం పొందలేదని, ఈ క్రమంలో వాటిని ఆసరాగా చేసుకుని...

రెవెన్యూ శాఖ లోపం వల్లే తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రుని కోరంగి కంపెనీ భూ వివాదానికి కారణమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. కోరంగి పంచాయతీ సీతారామపురంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటీషు పాలన అనంతరం కోరంగి రైసుమిల్లు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఇటీవల రైసుమిల్లును పడగొట్టి ఒకరు ఇటుక, ఇంకొకరు కలప తరలించుకు పోయానా రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం చూస్తూ ఊరుకుందన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్‌ శేషగిరిరావు ఆ భూములపై లోతుగా విచారించలేదన్నారు.

రాజధాని కోసమే భూ సేకరణ చేస్తున్నామంటున్న ప్రభుత్వ మాటల్లో వాస్తవం లేదని సిపిఎం క్రిడా ప్రాంత కమి టీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు గురువారం విలేకరుల సమా వేశంలో విమర్శించారు. రైతుల భూములను లాక్కొని సింగ పూర్‌, జపాన్‌ తదితర కంపెనీల వ్యాపారాలకు అప్పగించ డానికే బలవంతపు భూ సేకరణని, అందుకు ముఖ్యమంత్రి బెదిరించడం అప్రజాస్వామికమని ఆందోళన వ్యక్తం చేశారు. అది గోల్ఫ్‌ కోర్టులు, ధనవంతులకు విల్లాల నిర్మాణం కోసం సేకరించే భూమి మాత్రమేనని విమర్శించారు. అభివృద్ధి కోసం భూములు సేకరించకపోతే ఏలా అని మంత్రి యనమ ల రామకృష్ణుడు అంటున్నారని, ఇది ఎవరి అభివృద్ధి కోసమని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ చెల్లదన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారమంటూ, కేంద్ర...

రాజధాని ప్రాంతంలో భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంతవరకు యూనిట్‌ అధికారులగా ఉన్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను, ల్యాండ్‌ అక్విజిషన్‌ అధికారులుగా మారుస్తూ 304 నెంబరుతో జిఓ జారీ అయింది. 9.2 అభ్యంతర పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రేపటి నుండి నోటిఫికేషన్లు ఇవ్వనుంది. వీటిని ఆయా కార్యాలయాల పరిధిలో బహిరంగంగా ఏర్పాటు చేస్తారు. వీటిపై అభిప్రాయాలు చెప్పుకునేందుకు వారం రోజులు గడువిచ్చారు. వాటిని కూడా పరిష్కరించిన అనంతరం గ్రామాలవారీగా సేకరణ నోటిఫికేషన్‌ ఇస్తామని సిఆర్‌డిఎ అధికారులు చెప్పారు. అయితే గురువారం రాత్రి తొలి విడత నోటిఫికేషన్‌ విడుదలైంది. తుళ్లూరు మండలంలోని పిచ్చుకలపాలెం, అబ్బరాజపాలెం, బోరుపాలెం,...

Pages