District News

సమస్యల నిలయంగా అనకాపల్లి ఆసుపత్రి..
సరిపడిన స్టాప్ లేకపోవడంతో అవస్ధలు పడుతున్న రోగులు..
కొన్ని రోగాలకు దోరకని మందులు..
ప్రజారోగ్యవ్యవస్ధను నీరుకారుస్తున్నరని ప్రభుత్వం పై మండిపాటు..
ఆరోగ్యవ్యవస్ధ పరిరక్షణాకే ఉధ్యమిస్తాం..

ప్రచారోద్యమంలో భాగంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సర్వేలో పాల్గోన్న సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి కె.లోకనాధం , అనకపల్లి డివిజన్ కార్యదర్శి ఎ. బాలకృష్ణ...

జిల్లా కార్యదర్శి మాటలాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీలు , వివిధ కేటగిరీలకు చెందిన 520 పోస్టులు ఏళ్ళ తరబడి భర్తీ కావడంలేదు. సబ్ సెంటర్లు...

ప్రజాసమస్యలపై ప్రచార కార్యాక్రమంలో బాగంగా గుంటూరు ప్రభుత్వ జనరల్ హస్పిటల్ ను సందర్శించారు. దాతల సహకారంతో పేద ప్రజలకు వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రారంభించిన జి.జి.హెచ్ లొని మిలీనియం బ్లాక్ నేడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష్యం మూలన పదిందని విమర్శించారు. ప్రభుత్వం వైద్య రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనె అతి పెద్ద హస్పిటల్స్ లో గుంటూరు జి.జి.హెచ్ ఒకటి, కాని చుట్టుపక్కల జిల్లాల నుండి ఇక్కడకి వస్తుంటే కనీసం రోగులకు సరిపడిన డాక్టర్లు, నర్సులు లేకపోతె పేద ప్రజలకు వైద్యం ఎలా అందుతుంది అని ప్రశ్నించారు. కార్డియోదోరాసిస్ సర్జరికి పి.పి.పి పద్దతులో ఆపరేషన్లు జరుగుతున్నయని దినీవలన ప్రజలపై బారం పడుతుందని, ఆపరేషన్లు చెయటానికి...

రైల్వే ప్రయాణీకులకు కావల్సింది బుల్లెట్‌ రైళ్లు కాదని, ప్రయాణంలో వారికి భద్రత కల్పించాలని అని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. మంగళవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లోని జరిగిన జంట రైలు ప్రమాదాలపై పొలిట్‌బ్యూరో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రైల్వేలలో తరచు జరుగుతున్న ఈ ప్రమాదాలలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా రైల్వే శాఖ పరిస్థితులపైన, భద్రతా ప్రమాణాలపైన ప్రభుత్వం ఇంకా కళ్లు తెరవటం లేదని, షరామామూలుగా భద్రతా కమిషనర్‌తో కంటితుడుపు దర్యాప్తునకు ఆదేశాలుజారీ చేసిందని విమర్శించింది. బుల్లెట్‌ రైళ్లు, హైస్పీడ్‌ రైళ్లు అంటూ పగటి కలలు కనటం మాని రైల్వే వ్యవస్థను గాడిన పెట్టి ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, తక్షణమే ట్రాక్...

గుంటూరులో బజరంగ్ జ్యూట్ మిల్లు కార్మికుల ఆందోళనకు సిపిఎం అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆందోళన చేస్తున్న కార్మికుల దీక్షా శిబిరాన్నిసందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ యాజమాన్యం కార్మికుల డిమాండ్లను పరిగణలోనికి తీసుకోని వారి జీవనోపాధికి సంబందించిన జ్యూట్ మిల్లును వెంటనే తిరిగి ప్రారంభించాలని కోరారు. 

కేంధ్రంలో బీజేపీ ప్ర‌భుత్వ‌ ఏడాది పాల‌న‌లో అన్ని ర‌కాల అవినీతి పెర‌గిపోయింద‌ని సీపీఎం పోలిట్ బ్యూరో స‌భ్యుడు ప్ర‌కాష్ క‌రత్ విమ‌ర్శించారు. కేంధ్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై దేశ‌వ్యాప్త ప్ర‌చారోద్య‌మాన్ని గుంటూరులో ఆయ‌న ప్రారంభించారు. ఆగ‌ష్టు 1 నుంచి 15 వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారోద్య‌మం ద్వారా ప్ర‌భుత్వవిధానాల వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తామ‌ని తెలిపారు. ఏడాది పాల‌న‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌లు, ధ‌ర‌ల పెరుగుద‌ల‌, మ‌తోన్మాదుల దాడులు వంటి విష‌యాల్లో త‌ప్ప ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు ఏవిధంగానూ నెర‌వేర‌డం లేద‌ని క‌ర‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై కేంధ్ర‌మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు అన్న‌దాత‌ల‌ను కింప‌రిచే...

 

- కౌలు పరిహారం, పెన్షన్ల కోసం రాస్తారోకో, అరెస్టు

- పలువురికి స్వల్పగాయాలు, దుర్భాషలాడిన సిఐ
- మీడియాపై ఆంక్షలు, పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
                        రాజధానిలో అసైన్డ్‌, సీలింగు భూములకు పరిహారం, నిరుపేదలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామన్న పెన్షన్లు ఇవ్వాలని తుళ్లూరులో మంగళవారం రాస్తారోకోకు దిగిన పేదలపై పోలీసులు ప్రతాపం చూపారు. వారిని నడిరోడ్డుపై ఈడ్చి పారేశారు. నాయకులను మాట్లాడనివ్వకుండా మైకు లాగేసుకున్నారు. సిఐ హనుమంతరావు నాయకులను, పేదలను పరుష పదజాలంతో దూషించారు. ఏరు..ఏంట్రా మీకు నోరు పెరిగింది...

 

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

సి.పి.యం ప్రచార కార్యాక్రమంలో బాగంగా చుట్టుకుంట సెంటర్ లో విద్యార్ధులతో పాశం రామారావు మాట్లడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలన్నారు. ఎంతో అభివృద్ది చెందినదని చెప్పుకుంటున్న జిల్లాలో సుమారు 16 మండలలో 50 శాతం లోపు అక్షరాస్యతతోనే ఉన్నాయని, వాటిల్లో 15 మండలాలు పల్నాడు ప్రాతంలోనే ఉండటం శోచనీయమన్నారు ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినా ఉపాధి మాత్రం చాలా నామమాత్రంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహలు మౌలిక వసతులు కల్పించకపొవటంతో కునారిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగర కార్యదర్శి ఎన్. భావన్నారాయణ మాట్లాడుతూ నగరంలో మున్సిపల్ పాఠసాలల్లో అనేక సమస్యలున్నాయని, అదనపు తరగతి గదులు నిర్మించాలని,...

 

గుంటూరు: ప్రశ్నించడం కోసమే వచ్చానన్న పవన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని గుంటూరు భజరంగ్‌మిల్‌ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి కల్పించాలంటూ గత రెండు నెలలుగా నిరసనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాధానం చెప్పాల్సిన మిల్లు యాజమాన్యం ఆస్తులు అమ్ముకునే ఆలోచనలో పడిందని, స్పందించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

 

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

Pages